Begin typing your search above and press return to search.

మునుగోడుపై నాలుక మడతేల షర్మిలా..? ఇప్పుడు బహిష్కరణా..? కోమటిరెడ్డికి ఫేవరా?

By:  Tupaki Desk   |   22 Oct 2022 11:30 AM GMT
మునుగోడుపై నాలుక మడతేల షర్మిలా..? ఇప్పుడు బహిష్కరణా..? కోమటిరెడ్డికి ఫేవరా?
X
ఏపీలో అన్న అధికార సాధనకు భారీగా ప్రచారం చేసి.. గెలిచాక విభేదించి.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్ టీపీ) అంటూ తెలంగాణ తో ఏ సంబంధమూ లేకున్నా ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల తన దశ-దిశ లేని రాజకీయ ప్రయాణాన్ని చాటుతున్నారు. పాదయాత్ర అంటూ నిన్నమొన్నటి వరకు తిరిగిన ఆమె.. కాళేశ్వరంపై ఫిర్యాదు అంటూ ఢిల్లీకి వెళ్లారు. కొన్ని రోజులు అక్కడే ఉన్న ఆమె.. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు చేశారు. మొత్తం ప్రాజెక్టే అంత విలువ ఉంటే.. అంతే మొత్తానికి అవినీతి ఏమిటో ప్రతిపక్షాలకు తెలియాలి.

మునుగోడును వదలి.. తన గోడు తెలుగు రాష్ట్రాల్లో ఆ మాట కొస్తే దేశవ్యాప్తంగా చర్చ రేపుతున్నది మునుగోడు ఉప ఎన్నిక. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ ధనం విపరీతంగా ఖర్చుపెడుతూ పోతూ
అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా దీనిని మార్చాయి. వీటి మధ్యలో నాయకులు, కార్యకర్తలను కోల్పోతూ కాంగ్రెస్ మిగిలిపోతోంది. అయినా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన వంతు పోరాటంతో కాంగ్రెస్ ను పోటీలో నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.

ఏపీ సరిహద్దు జిల్లా కావడంతో సమీపంలోని నియోజకవర్గాల్లో అయితే వైఎస్ పై అభిమానం మరీ ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీంతోనే షర్మిల పార్టీ వైఎస్సార్ టీపీకి కొంతలో కొంత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఓట్లు పడే వీలుంది. ఇదే సమయంలో వచ్చిన మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీ పోటీ చేసి ఉంటే ఓ రాజకీయ పార్టీగా తన స్థాయి, స్థానం ఏమిటో తెలిసేది. కానీ, దీనిని వదిలి షర్మిల ఢిల్లీ వెళ్లారు.

పోటీ చేస్తామని.. చేయమని.. బహిష్కరించమంటూ మునుగోడులో పోటీ చేస్తామని ఓసారి.. చేయబోవడం లేదని ఓసారి వైఎస్ షర్మిల ప్రకటించారు. అయితే, ఆమె పార్టీ గురించి మాట్లాడి పెద్దది చేయడం ఎందుకని ఎవరూ దీనిని పట్టించుకోలేదు. కానీ, ఓ పార్టీ స్టాండ్ ఏమిటనేది ఎన్నికల సమయంలోనే తేలుతుంది. మునుగోడులో ఈ చాన్స్ ను షర్మిల పార్టీ మిస్ చేసింది. అయితే, అన్నిటికంటే మించి ఇప్పుడు మునుగోడులో ఎన్నికను బహిష్కరించాలంటూ షర్మిల ఓటర్లకు పిలుపునివ్వడం ఆశ్చర్యం కలిగించింది.

తొలి ఎన్నికను వదులుకుంటారా..? షర్మిల గతేడాది తన పార్టీని ప్రారంభించారు. తెలంగాణలో పాదయాత్ర కూడా చేశారు. నిరుద్యోగ దీక్షలంటూ హడావుడి చేశారు. సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలకు దిగారు. ఆ జోష్ చూసి
అందరూ ఆశ్చర్యపోయారు. తీరా.. పార్టీ పెట్టాక తొలిసారి వచ్చిన ఎన్నికలో పోటీ చేయకుండా ఉండిపోయారు. ఎవరైనా కొత్త పార్టీ వారు ఇలాంటి అవకాశాన్ని వదులుకోరు. కానీ, షర్మిల వ్యూహం ఏమిటో తెలియదు కానీ.. ఉప ఎన్నికకు దూరంగా ఉన్నారు. అయితే, ఇక్కడో విషయం చర్చనీయాంశం అవుతోంది. షర్మిల తండ్రి వైఎస్.. కోమటిరెడ్డి కుటుంబానికి రాజకీయ గాడ్ ఫాదర్. ఆయన ప్రాపకంతోనే కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగారు. ఇప్పుడు పైకి వేరుగా కనిపిస్తున్నా.. కోమటిరెడ్డి బ్రదర్స్ ది ఎప్పుడూ ఒకటే మాట.

ఈ నేపథ్యంలోనే షర్మిల పార్టీ బరిలో ఉంటే వైఎస్ అభిమానులు చీలిపోయి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రతికూలంగా మారుతుంది. ఇలాంటివారి సంఖ్య ఎంత ఉన్నది అన్నది కాదు.. ఒక పార్టీ అంటూ బరిలో ఉంటే (వైఎస్సార్ టీపీ) అప్పటి పరిస్థితి వేరుగా ఉంటుంది. వారికో అభ్యర్థి.. గుర్తు.. ప్రచారం.. దాని ప్రభావం కనిపిస్తుంది. అసలు అభ్యర్థే లేకుంటే అదేమీ ఉండదరు. రాజగోపాల్ రెడ్డికి ఫేవర్ చేసేందుకే వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల ఇలాంటివేమీ లేకుండా చేశారని రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.