Begin typing your search above and press return to search.

షర్మిల ఆశ చావలేదు.. ఎన్ని కమిటీలు వేసినా గెలవడం కష్టమే..

By:  Tupaki Desk   |   7 Jan 2023 11:30 PM GMT
షర్మిల ఆశ చావలేదు.. ఎన్ని  కమిటీలు వేసినా గెలవడం కష్టమే..
X
వైఎస్ షర్మిల 3వేల కి.మీల పాదయాత్ర మించి తెలంగాణలో పర్యటిస్తున్నా ఆమె పార్టీ ఊపు మాత్రం రావడం లేదు. కనీసం సర్పంచ్ స్థాయి నేతలు కూడా చేరడం లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక.. బీఆర్ఎస్ నేతలతో పంచాయితీలు పెట్టుకోలేక తాజాగా కమిటీల బాటపట్టింది.

వైఎస్ షర్మిల తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరుగురు సభ్యులతో పార్టీ రాజకీయ కార్యాచరణ కమిటీని నియమించారు. ఉమ్మడి జిల్లాలోని నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేయడంతోపాటుగా వారిని చైతన్య పరచడానికి రాజకీయ కార్యాచరణ కమిటీ సభ్యులను నియమిస్తున్నట్టు వైఎస్ షర్మిల తెలిపారు. ఈ మేరకు వైఎస్ఆర్ టీపీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

తన పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదని డిసెంబర్ లో వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది. ఈ దీక్షతో ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నది. కొద్దిరోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పడంతో సంక్రాంతి వరకూ పాదయాత్రలకు బ్రేక్ ఇచ్చింది. తర్వాత రాష్ట్రంలో పాదయాత్ర కొనసాగిస్తానని షర్మిల ప్రకటించారు.

తాజాగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజకీయ కార్యచరణ కమిటీని నియమించింది. ఇందులో ఒకప్పుడు కీలక నేతగా ఉన్న గట్టు రాంచంద్రరావుతోపాటు కొండా రాఘవ రెడ్డి, పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, గడిపల్లి కవిత, నీలం రమేష్ లను నియమించింది.

అయితే వీరంతా ఔట్ డేటెడ్ నాయకులే. ఒక్కరూ గుర్తింపు నాయకులు లేరు. వీరితో ఏం కాదు. తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ నేతలు కారు. వీరిలాంటి వారితో ఎన్ని కమిటీలు వేసినా గెలవడం కష్టమే. అయినా షర్మిల ఆశ చావకుండా ఇలా కమిటీలతో కాలయాపన చేస్తోందని తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.