Begin typing your search above and press return to search.
కోమటిరెడ్డికి షర్మిల ఆహ్వానం.. పార్టీ మార్పుపై స్పందించిన కోమటిరెడ్డి
By: Tupaki Desk | 8 July 2021 9:56 AM GMTతెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు షర్మిల పార్టీ పెడుతుండడం.. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకంతో సమీకరణాలు మారిపోయాయి. ఇన్నాళ్లు టీఆర్ఎస్, బీజేపీ మధ్యనున్న రాజకీయం టర్న్ తీసుకుంది. కాంగ్రెస్ కు, షర్మిలకు ఇప్పుడు తెలంగాణలో అవకాశాలు పెరిగాయి.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికోసం చివరకు పోటీ పడి భంగపడ్డారు కోమటిరెడ్డి. అందుకే టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి కావడాన్ని జీర్ణించుకోలేకుండా అసమ్మతి రాజేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణకు కూడా దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వైఎస్ షర్మిల తన పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ లో ఇమడలేకుండా ఉన్న కోమటిరెడ్డిని ఈరోజు కొత్తగా తెలంగాణలో పార్టీ పెడుతున్న షర్మిల తన పార్టీలోకి రావాలని కోరారు.
తాజాగా తెలంగాణలో పార్టీ పెడుతున్న వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. పార్టీ సభ జరుగనున్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఆగి వైఎస్ఆర్ అభిమానులతో ఎంపీ ముచ్చటించారు. పార్టీ ఆవిర్భావ వేడుకకు రావాలని తనకు ఆహ్వానం పంపారని కోమటిరెడ్డి తెలిపారు. వైఎస్ గొప్ప నేత అని కొనియాడారు.
వైఎస్ఆర్ జయంతి సందర్భంగా భువనగిరిలో ఆయనకు నివాళులు అర్పించేందుకు వెళ్తున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి తొలి నుంచి వైఎస్ఆర్ కు అనుచరుడిగా ఉన్నారు. 2009లో రెండోసారి వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చాక సీనియర్ జానారెడ్డిని సైతం పక్కనపెట్టి కోమటిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు వైఎస్ఆర్. అందుకే ప్రత్యేకంగా వెళ్లి మరీ ఈరోజు నివాళులర్పించారు.
రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డిని కావాలనే షర్మిల ఆహ్వానం పంపించి ఉంటుందని.. రెడ్డి సామాజికవర్గాన్ని ఒక్కటి చేయడం.. కాంగ్రెస్ కు దూరం చేయడమే లక్ష్యంగా షర్మిల అడుగులు వేస్తున్నట్టు తెలిసింది.
-కాంగ్రెస్ లోనే ఉంటాను.. పార్టీ మారనన్న కోమటిరెడ్డి
భువనగిరిలో వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ మార్పు వార్తలు, షర్మిల ఆహ్వానంపై స్పందించారు. తనకు పీసీసీ చీఫ్ పదవి రాకపోవడంతో బాధగా అనిపించిందన్నారు. ‘అర్హత ఉండి పదవి ఇవ్వలేదు. చాలా పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయని.. ఏ పార్టీలో చేరను అని.. కాంగ్రెస్ లోనే కొనసాగుతానని’ కోమటిరెడ్డి తెలిపారు. పార్టీలో గ్రూపు రాజకీయాలు చేస్తే అందరం నష్టపోతామని.. గాంధీ భవన్ లో కూర్చుంటే ఎన్నికల్లో గెలవలేం అని అన్నారు.
కేసీఆర్ ను ఓడించాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. దీంతో కోమటిరెడ్డి పార్టీ మార్పు ఊహాగానాలకు తెరపడినట్టైంది.