Begin typing your search above and press return to search.

'మల్లన్న'ను చూసి నేర్చుకో షర్మిల: ఇదే టాక్..!

By:  Tupaki Desk   |   27 March 2021 10:07 AM GMT
మల్లన్నను చూసి నేర్చుకో షర్మిల: ఇదే టాక్..!
X
ఆంధ్రా ఆడబిడ్డ వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయం చేయడానికి నడుం బిగించింది. ఈ మేరకు సన్నాహాలు చేస్తోంది. అయితే రూట్ మార్చుకుంటే మంచిది అని కొందరు రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. 'తీన్మార్ మల్లన్న'లా రాజకీయం చేయాలని సూచిస్తున్నారట..

తెలంగాణలో ఇటీవల రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నల్గొండ-వరంగల్-ఖమ్మం తోపాటు మరొకటి హైదరాబాద్-మహబూబ్ నగర్- రంగారెడ్డి జిల్లాల గ్రాడ్యూయేట్ ఎన్నికలు పోటాపోటీగా సాగాయి. అధికార పార్టీకి ఎవరూ ఊహించని విధంగా ఒక ఇండిపెండెట్ అభ్యర్థి గట్టిపోటీనివ్వడం చర్చనీయాంశంగా మారింది. జాతీయ స్థాయిలో విస్తరించిన బీజేపీ ఇక్కడ కనీసం మూడో స్థానంలో కూడా నిలువలేకపోయింది. దుబ్బాక, జీహెచ్ఎంసీలో ఊపేసిన బీజేపీ మ్యాజిక్ గ్రాడ్యూయేట్ల ముందు పనిచేయలేదు. స్వతంత్ర అభ్యర్థిగా దిగి రెండో స్థానంలో పోటీనిచ్చిన 'తీన్మార్ మల్లన్న' పేరు ఇప్పుడు తెలంగాణలో మారుమోగుతోంది.

తెలంగాణలో రాజకీయం ఎప్పుడూ కొత్తగానే ఉంటోంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న ఇక్కడి ప్రజలు నికార్సయిన వ్యక్తిని చూసే ఓటేస్తున్నారని అర్థమవుతోంది. గత ఆరేళ్లుగా తెలంగాణలో తిరుగులేదని నిరూపించుకున్న టీఆర్ఎస్ కు జలక్ ఇచ్చేందుకు బీజేపీకి చెందిన బండి సంజయ్ ను ఎంపీగా గెలిపించుకున్నారు. ఆ తరువాత దుబ్బాక, జీహెచ్ఎంసీ ప్రజలు కూడా బీజేపీని ఆదరించారు. అయితే వరంగల్ పట్టభద్రల ఎన్నికల్లో మాత్రం తీన్మార్ మల్లన్నపై అభిమానం విపరీతంగా పెరిగింది. యూట్యూబ్ చానెల్ ద్వారా ప్రభుత్వానికి ప్రశ్నించే ఆయనకు గ్రౌండ్ లెవల్లో నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు.

ఇదిలా ఉండగా గత రెండు, మూడు నెలలుగా తెలంగాణలో కొత్త పార్టీ పెడుతానని ప్రచారం చేస్తున్న షర్మిల అధికారికంగా మాత్రం ప్రకటించడం లేదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి దగ్గరయ్యేందుకు షర్మిలతో సమావేశం నిర్వహిస్తున్న కొందరు నాయకులు మల్లన్న ప్రస్తావన తీసుకొచ్చారట. తీన్మార్ మల్లన్న లా రాజకీయం చేద్దామని కొందరు సూచనలు ఇచ్చారట. ఆత్మీయ సమావేశాల ద్వారా నాయకులకు దగ్గరవుతాము గానీ ప్రజలకు దగ్గర కాలేమని కొందరు నాయకులు సూచిస్తున్నారట.

గ్రౌండ్ లెవల్లో నిజమైన కార్యకర్తలను సంపాదించుకుంటే ప్రజల నాడి తెలిసిపోతుందని, అప్పుడు ప్రజలకు ఏం కావాలో..? వారికీ ఏం చేయాలో..? అర్థమవుతుందని అంటున్నారట. అంతేగానీ.. వయసు మీద పడిన నాయకులను పార్టీలో తీసుకుంటే మిగతా పార్టీల్లాగే దెబ్బతింటుందని వైఎస్ షర్మిలకు నేతలు సూచించారట.. నిరుద్యోగం, ఇతర ఆర్థిక ఆదాయం లేక యువకులు నీరసంగా ఉన్నారని, వారికి అవకాశం ఇస్తే పార్టీని అత్యున్నత స్థానంలో నిలబెడుతారని తెలిపారట...

తీన్మార్ మల్లన్న కూడా అదే స్థాయిలో నిజాయితీగా ప్రభుత్వంపై విమర్శలు చేశారని, అందువల్లే ఆయన అంతగా పాపురల్ అయ్యారని షర్మిలకు చెప్పారట. ఇప్పటికీ షర్మిల పార్టీ ప్రకటన అధికారికంగా చేయకపోయినా తాను సీఎం అభ్యర్థినని చెప్పుకోవడం ద్వారా అప్రతిష్టపాలవుతామని సూచిస్తున్నారట. మరి షర్మిల ఏమేరకు మల్లన్న గురించి ఆలోచిస్తారో చూద్దాం..