Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఫ్యామిలీ ఇరుకున పడేలా షర్మిల కొత్త వాదన
By: Tupaki Desk | 16 Feb 2021 11:39 AM GMTతెలంగాణలో షర్మిల పార్టీకి ఉన్న అవకాశాలేమిటి? అసలు సాధ్యమేనా? సీమకు చెందిన ఆమెను తెలంగాణ ప్రజలు ఎందుకు ఆదరిస్తారు? ఇలాంటి ప్రశ్నలెన్నో వచ్చాయి. కానీ.. షర్మిల పార్టీ పెట్టే దిశగా కీలక సమావేశాల్ని వరుస పెట్టి నిర్వహిస్తున్నారు. ఆమెకున్న ధైర్యం గురించి అందరిలోనూ ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇలాంటివేళ.. షర్మిల అనుసరించే వ్యూహానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.
షర్మిలను ఎవరైనా ఆంధ్రా అన్నంతనే.. వారి నోరు మూతపడే వాదన సిద్దం చేసుకున్నట్లుగా సమాచారం. అంతేకాదు.. షర్మిలను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ సైతం మాట్లాడలేని పరిస్థితి ఉందంటున్నారు. అదెలా అంటే.. షర్మిల పుట్టింది హైదరాబాద్ లో కావటంతో.. ఆమెను జన్మత: హైదరాబాద్ నగరవాసి అవుతారు. అయినప్పటికి సీమ లింకు తీసుకొస్తే.. తన అత్తారిల్లు తెలంగాణ కావటం.. తాను తెలంగాణ కోడల్ని కావటాన్ని ప్రస్తావించనున్నట్లు చెబుతున్నారు.
అంతేకాదు.. సీఎం కేసీఆర్ కోడలు ఆంధ్రా మూలాల ప్రస్తావన కూడా తెచ్చే వీలుందంటున్నారు. తెలంగాణ కోడల్ని పట్టుకొని ఆంధ్రా లింకును ఎలా తెస్తారని సూటిగా ప్రశ్నించే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా.. తనకు ఆంధ్రా ట్యాగ్ తగిలించే వారికి ఘాటుగా బదులు ఇచ్చేలా తన వాదనను షర్మిల సిద్ధం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా.. పుట్టినిల్లు ఆంధ్రా.. మెట్టినిల్లు తెలంగాణ..? అదేమైనా తప్పా? నేను తెలంగాణ కోడల్ని అవునా? కాదా? అన్న సూటిప్రశ్న టీఆర్ఎస్ వర్గాలకు ఇబ్బందే అన్న మాట వినిపిస్తోంది. మరేం చేస్తారో చూడాలి.