Begin typing your search above and press return to search.
చెల్లెమ్మ చెడుగుడు...కేసీయార్ తో పాటు అన్నకూ షాకేనా....?
By: Tupaki Desk | 6 Oct 2022 12:39 AM GMTతెలంగాణాలో మరో ఆంధ్రా పార్టీ పెట్టకూడదు, పుట్టకూడదు అన్న బిర్రబిగుసుకుని కూర్చుకున్న టీయారెస్ రాజకీయ కట్టడి విధానాన్ని బ్రేక్ చేసేలా వైఎస్సార్ తనయ షర్మిల పార్టీ పెట్టారు, ఊరూరా తిరుగుతున్నారు. ఆమె తాను తెలంగాణా కోడలిని అని ఎంత చెపుకున్నా ఆమె ఆంధ్రా మూలాలు అందరికీ ఎరుకే. మరీ ముఖ్యంగా అందరి గోత్రాలు జాతకాలు తవ్వి తీసే టీయారెస్ కి అవి ఇంకా ఎరుకే. అయినా షర్మిల దూకుడు చేస్తూంటే ఎందుకు పట్టించుకోవడం లేదు అంటే దానికి రెండు కారణాలు చెప్పుకోవాలి.
మొదటిది జగన్ చెల్లెలు ఆమె. జగన్ తో తెర వెనక బంధాలు టీయారెస్ కి ఉన్నాయని అని అంతా అనుమానిస్తారు. ఆ రాజకీయ బలం ఆమెకు ఆయుధంగా మారి తెలంగాణాలో టూర్లు వేసేలా చేస్తోంది అని అంటున్నారు. మరో కారణం ఏంటి అంటే ఆమె పార్టీ చాలా చిన్నదని, ఆమె ఎంత అరచి గీ పెట్టినా తమను ఢీ కొట్టలేదని, ఆ మాత్రం దానికి ఎందుకు నోరు చేసుకుని ఊరకే హైరానా పడడం అని కూడా.
అయితే చెల్లెమ్మ పాదయాత్రలతో వందల కిలోమీటర్లు తిరిగారు. అధికార టీయారెస్ ని ఎక్కడా వదలకుండా విమర్శలు చేస్తున్నారు. ఇక కేసీయార్ ని కేటీయార్ ని వ్యక్తిగతంగా కూడా విమర్శిస్తున్నారు. ఇవేమీ కూడా పట్టించుకోవడం లేదు అనుకున్నారో ఏమో ఇపుడు ఏకంగా కేసీయార్ అవినీతి గురించి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాను అని షర్మిల ఢిల్లీ బాట పడుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతి మీద విచారణ జరపాలని, అలాగే కేసీయార్ ఎనిమిదేళ్ల తన ఏలుబడిలో అక్రమంగా ఆస్తులు కూడగట్టారని, వాటి గుట్టు విప్పాలని కోరుతూ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కబోతున్నారు షర్మిల. ఆమె కేంద్ర హోం శాఖ అధికారులతో పాటు సీబీఐ అధికారులను కూడా కలసి తన దగ్గర ఉన్న ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నారని అంటున్నారు.
ఇక్కడ చూస్తే జాతీయ పార్టీని ప్రకటించిన ఉత్సాహంలో కేసీయార్ ఉన్నారు. అదే టైమ్ లో ఆ మరుసటి రోజే ఢిల్లీకి వెళ్లి కేసీయార్ అవినీతి మీద లొల్లి చేయాలని షర్మిల అనుకోవడం అంటే దీని వెనక బీజేపీ పెద్దలు ఉన్నారా. వారే ఆమెను ముందు పెట్టి ఆడిస్తున్నారా. కేసీయార్ ని ఇరకాటంలో పెట్టడానికి పావులా వాడుకుంటున్నారా అన్న చర్చ అయితే ముందూ వస్తోంది. మరో విషయం చెప్పుకోవాలీ అంటే షర్మిల ఇప్పటిదాకా బీజేపీని పల్లెత్తు మాట అనలేదు. దాంతోనే అందరికీ అనుమానాలు బాగా పెరిగిపోతున్నాయి.
ఇవన్నీ ఇలా ఉంటే కేసీయార్ మీద నేరుగా షర్మిల ఎందుకు దాడి చేస్తున్నారు అన్నది కూడా చర్చగా ఉంది. తన అన్న జగన్ కి సన్నిహితం అనే ఆమె ఇలా చేస్తున్నారా. అన్న మీద కోపం తో కేసీయార్ మీద విమర్శల బాణాలు ఎక్కు పెడుతున్నారా అన్నది కూడా చర్చగానే ఉంది.
ఇలాగే చేసుకుంటూ పోతే ఇది కేసీయార్ తో పాటు తన అన్నను కూడా ఇండైరెక్ట్ గా ఇబ్బంది పెడుతుందని ఆమెకు తెలియకుండా ఉంటుందా. అంటే తెలిసేనా ఈ చెడుగుడు. ఈ రాజకీయ చెలగాటం అంటే. కచ్చితంగా కేసీయార్ జగన్ ల సీక్రెట్ బంధం అయినా బయట పడాలి. లేక ఇద్దరి మధ్య విభేదాలు అయినా పొడసూపాలి.
జగన్ చెల్లెమ్మే కేసీయార్ అవినీతి చిట్టా తీస్తాను అంటూంటే టీయారెస్ బీయారెస్ గా మారిన వేళ అదే జోరుతో ఏపీలో గర్జించకుండా ఉంటుందా. సో షర్మిలమ్మ చేస్తున్న దూకుడు వెనక అన్నకు కూడా బాణాలు గట్టిగా గుచ్చాలనే అజెండా వేరేది ఏమైనా ఉందా. ఏమో రాజకీయాల్లో ఎటు నుంచి టార్గెట్ చేస్తే ఎటు నుంచి తగులుతుందో. అంతా అర్ధం కాని యవ్వారేమే కదా. ఇవన్నీ తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.