Begin typing your search above and press return to search.
నేడు షర్మిల పార్టీ ఆవిర్భావం..తొలి పిలుపు ఇదే
By: Tupaki Desk | 5 July 2021 2:27 AM GMTతెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతోంది. జూలై 8న నేడు కొత్త పార్టీని వైఎస్ షర్మిల పెట్టబోతున్నారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను వైఎస్ షర్మిల ముఖ్య అనుచరులు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వేన్షన్ లో వైసీపీ కార్యకర్తల మధ్య పార్టీ ప్రకటన చేయనున్నారు.
హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో కొత్త పార్టీ ఆవిర్భావ కార్యక్రమ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. జేఆర్సీ కన్వేన్షన్ సెంటర్ లో జరిగే పార్టీ ఆవిర్భావానికి ఒక్కో జిల్లా నుంచి 2వేల మందికి పైగా అభిమానులు వచ్చే అవకాశం ఉంది. పార్టీ ఆవిర్భావానికి ఇన్విటేషన్ ఉన్న వారికే అనుమతిస్తున్నారు.పార్టీ ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున జనాలను తరలిస్తున్నారు. వారి ముందు పార్టీ ఆవిష్కరణ చేయాలని షర్మిల నిర్ణయించారు. పెద్ద ఎత్తున పార్టీ కండువాలు సిద్ధం చేశారు.
ఇక రేపటి నుంచి పార్టీ కార్యక్రమాలు ఏం చేయాలో కూడా డిసైడ్ అయ్యారు. 8వ తేదీన నూతన పార్టీ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను పూలతో అలంకరించాలని షర్మిల పిలుపునిచ్చారు.
దివంగత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నేడు వైఎస్ షర్మిల పార్టీని ప్రకటించనున్నారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ జేఆర్సీ కన్వేన్షన్ సెంటర్ లో వైఎస్ఆర్ టీపీ ఆవిర్భావ సభ జరుగనుంది. ఇప్పటికే ‘వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ’గా పేరును ఖరారు చేశారు. సభకు సంబంధించి రోడ్డు మ్యాప్ తాజాగా ఖరారైంది. నేడు వైఎస్ షర్మిల బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో ఇడుపుల పాయకు చేరుకుంటారు. ఉదయం 8.30 గంటలకు షర్మిల అక్కడ వైఎస్ఆర్ ను నివాళులర్పించి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు పంజాగుట్టలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. సాయంత్రం 4 గంటలకు జేఆర్సీ కన్వేన్షన్ చేసుకొని 5 గంటలకు పార్టీ ఆవిర్భావ ప్రకటన.. జెండాను ఆవిష్కరిస్తారు.
జెండాను తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట రంగుతో రూపొందించారు. జెండాను తెలంగాణ మ్యాప్ తోపాటు వైఎస్ఆర్ చిత్రం ఉండేలా డిజైన్ చేశారు. 80శాతం పాలపిట్ట రంగు.. 20శాతం నీలిరంగు ఉంటుంది. మొదట 8న పార్టీ ఆవిర్భావం వేళ వైఎస్ఆర్ విగ్రహాలు సిద్ధం చేసి నివాళులర్పించాలని వైఎస్ షర్మిల తొలి పిలుపు ఇచ్చారు.