Begin typing your search above and press return to search.

ష‌ర్మిల రాజ‌కీయం.. కామెడీ అయిందిగా!

By:  Tupaki Desk   |   13 Dec 2021 10:30 AM GMT
ష‌ర్మిల రాజ‌కీయం.. కామెడీ అయిందిగా!
X
తెలంగాణ‌లోనూ రాజ‌న్న రాజ్యం తీసుకువ‌స్తానంటూ.. గంభీర వ్యాఖ్య‌లు చేసిన దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి త‌న‌య ష‌ర్మిల పార్టీ ప‌రిస్థితి ఇప్పుడు కామెడీ అయింద‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ఆమె చేస్తున్న కార్య‌క్ర‌మాల్లో ప‌స ఉండ‌డం లేదని, ఆమె మాట‌ల్లో పంచ్ ఉండ‌డం లేదని ఆయ‌న న‌డ‌త‌లో విశ్వ‌స నీయత క‌నిపించ‌డం లేద‌ని.. పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో కామెంట్లు కురుస్తున్నాయి.

ఇప్ప‌టికి పార్టీ పెట్టి దాదాపు ఆరు మాసాలు అయింది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీలో ఊపు.. ఉత్సాహం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. పైగా, ఆమె తీసుకుంటున్న అంశాల‌కు కూడా ఎవ‌రూ మొగ్గు చూప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి ఎవ‌రు పార్టీ పెట్టినా.. తొలి రెండు మూడు మాసాల్లోనే ఫాలోయింగ్ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చి చేరేవారు.. పార్టీని ముందుండి న‌డిపించేవారు.. తేలిపోతారు. గ‌తంలో తెలంగాణ గ‌డ్డ‌పై అనేక పార్టీలు వ‌చ్చాయి. ముఖ్యంగా తెలంగాణ గ‌ట్ట‌పై పుట్టిన వాళ్లే పెట్టిన పార్టీలే అవ‌న్నీ. అయితే.. వారే స‌క్కెస్ కాలేక.. జెండాలు ఎత్తేసుకున్న ప‌రిస్థితి క‌నిపించింది.

ఇలాంటి వారిలో తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో నాయ‌క‌త్వం వ‌హించిన వారు కూడా ఉన్నారు. మ‌రి తెలంగాణ ఉద్య‌మంతో సంబంధం లేని, అసలు తెలంగాణ గ‌డ్డ‌తో మెట్టినింటి సంబంధం త‌ప్ప‌.. ఇక్క‌డి వాస‌న‌లు తెలియ‌ని.. ష‌ర్మిల పార్టీ పెడితే.. ఎవ‌రు మాత్రం వ‌స్తారు? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

పైగా.. ఆమె నిజంగానే తెలంగాణకు వీరోచిత వ‌నిత‌గా మారాల‌ని అనుకున్న‌ప్పుడు.. సుమారు ఏడేళ్లుగా ఏం చేసిన‌ట్టు? తెలంగాణ ప్ర‌జ‌లు.. ఉద్యమంలో రోడ్డెక్కిన‌ప్పుడు.. మ‌ట్టికొట్టుకుపోయిన ముఖాల‌తో ప్ర‌త్యే క రాష్ట్రం కోసం.. అర్రులు చాచిన‌ప్పుడు.. ష‌ర్మిల కేరాఫ్ ఎక్క‌డ‌? ఇవి ఆవేశంతో ఆమెంటే గిట్ట‌నివారు అడుగుతున్న ప్ర‌శ్న లు కాదు.. ష‌ర్మిల ప్ర‌స్తావ‌న వ‌చ్చిన ప్ర‌తిసంద‌ర్భంలోనూ ప‌ల్లెల నుంచి హైద‌రాబా ద్ గ‌ల్లీల వ‌ర‌కు .. సాధార‌ణ ప్ర‌జ‌లు.. చ‌ర్చించుకుంటున్న ప్ర‌శ్న‌లు. తెలంగాణ ప‌ల్లెల్లో `ఈరిగాడి పేర‌డీ` పేరిట‌.. సంక్రాంతి స‌మ‌యంలో ఒక ఆట ఆడుతుంటారు.

అత‌ని ప‌నేంటంటే.. త‌ను న‌వ్వుల పాల‌వుతూ.. త‌న‌ను చూస్తున్న‌వారిని న‌వ్వించ‌డ‌మే! న‌వ్వినంత సేపు న‌వ్వుకున్నోళ్లు.. ఓ ముద్ద చ‌ద్దెన్నం పెట్టి ఈరిగాణ్ని సాగ‌నంపుతారు. ఇలానే ఇప్పుడు.. ష‌ర్మిల పార్టీ ప‌రిస్థితి కూడా ఇలానే ఉంద‌ని పెద్ద టాక్ న‌డుస్తోంది. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం ఒక వార్డు మెంబ‌ర్ కూడా ష‌ర్మిల చెంతకు చేర‌లేదు.

పోనీ..ఉన్న‌వారైనా ఉన్నారా? అంటే.. ఒక్కొక్క‌రుగా కాదు.. గుంపులుగానే జారిపోతున్నారు. అంతేకాదు.. యాంటీ ప్ర‌చారం కూడా జ‌రిగిపోతోంది. అయినా కూడా ష‌ర్మిల‌లో ఆశ ఎక్క‌డా చావ‌న‌ట్టుగా క‌నిపిస్తోంది.

ముఖ్యంగా సీఎం కేసీఆర్‌పైనా.. అధికార పార్టీపైనా, ఆయ‌న చేస్తున్న‌విమ‌ర్శ‌లు కూడా కామెండీగా ఉన్నాయ‌నే కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. ష‌ర్మిల మాత్రం ఏదో చేయాల‌నే అతి చేస్తున్నారు. ఎవ‌రో ఒక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకుంటే.. త‌క్ష‌ణ‌మే అక్క‌డ వాలిపోయి.. ప‌రిష్కారం చేయాలంటూ.. ముఖ్య‌మంత్రిమీద ప‌రుష ప‌ద‌జాలంతో మాట్లాడుతున్నారు.

దీంతో అయినా మీడియాలో ప్ర‌చారం వ‌స్తుంద‌ని.. ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. కేవ‌లం ఈ స్ట్రాట‌జీ త‌ప్ప‌.. ఆమెను ఒక నాయ‌కురాలిగా కానీ.. పార్టీ స్థాప‌కురాలిగా కానీ.. ఎవ‌రూ చూడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అందుకే ష‌ర్మిలపార్టీ కామెడీ అయిపోయిందే! అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.