Begin typing your search above and press return to search.
కేసీఆర్ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకే షర్మిల పార్టీ: రేవంత్
By: Tupaki Desk | 9 Feb 2021 2:10 PM GMTతెలంగాణలో ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ చెల్లెలు షర్మిల పార్టీ పెడుతున్నట్టు చేసిన ప్రకటన రాజకీయంగా వేడి పుట్టించింది. ఇప్పటికే ఇక్కడ అధికార టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ పుట్టుకురావడం.. కాంగ్రెస్ పార్టీ కూడా ఆది నుంచి ప్రతిపక్షంగా ఉండడం.. ఇప్పుడు షర్మిల పార్టీ రాకతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పథకాలు, పాలన వైభవాన్ని గుర్తు చేస్తూ షర్మిల పార్టీ అడుగులు నడుస్తాయని ఆమె స్వయంగా వెల్లడించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామన్నారు.షర్మిల పార్టీపై కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాక్యలు చేశారు. వైఎస్ఆర్ కు తెలంగాణలో అభిమానులున్న మాట వాస్తవమేనని.. అయితే అంతమాత్రాన షర్మిల పార్టీ పెడితే అంగీకరించరని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
షర్మిల పార్టీపై సీఎం కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని.. కేసీఆర్ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకే పార్టీ పెడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోందన్నారు.ఎవరు పార్టీ పెట్టినా కాంగ్రెస్ కు నష్టం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం వస్తుందన్నారు.