Begin typing your search above and press return to search.
వైఎస్ పై విరుచుకుపడే టీ నేతలకు షర్మిల పంచ్ లు షురూ!
By: Tupaki Desk | 26 Jun 2021 3:46 AM GMTరాజకీయాల్లోకి రానంత వరకే. ఒకసారి వచ్చాక వెనుకా ముందు చూసుకోకూడదు. గతంలో మాదిరి విలువలు.. సిద్ధాంతాలు అన్న వాటి కంటే ఎంత ఎక్కువ దూకుడును ప్రదర్శిస్తాం.. ఇష్యూలపై మరెంత తీవ్రంగా రియాక్ట్ అవుతామన్న దానిపైనే అధినేతల సమర్థత అర్థమవుతుందన్న భావన ఎక్కువ అవుతోంది. తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసేందుకు గడిచిన కొంతకాలంగా కసరత్తు చేస్తున్న వైఎస్ షర్మిల.. కాలానికి తగ్గట్లే వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒక మాట అనేందుకు సవాలచ్చ ఆలోచించే నేతలకు భిన్నంగా ఆమె తీరు ఉందని చెప్పాలి.
తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తపిస్తున్న ఆమె.. గడిచిన కొద్ది రోజులుగా ఏ చిన్న అవకాశం లభించినా.. సీఎం కేసీఆర్ మీద నేరుగా విరుచుకుపడుతున్నారు. గడిచిన ఏడేళ్ల కాలంలో తక్కువ వ్యవధిలో కేసీఆర్ పై ఎక్కువ విమర్శలు చేసిన అధినేత ఎవరైనా ఉన్నారంటే అది షర్మిలే అవుతారు. తాజాగా ఏపీ ప్రభుత్వం నీటి చౌర్యానికి పాల్పడుతుందని.. అనుమతి లేని ప్రాజెక్టుల్ని నిర్మిస్తుందని సీఎం కేసీఆర్ ఫైర్ కావటం తెలిసిందే. అనంతరం తెలంగాణ మంత్రులు తమకు తోచిన రీతిలో దివంగత మహానేత మాజీ సీఎం వైఎస్ ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కేసీఆర్ అండ్ కో మీద జగన్ అండ్ కో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తుంటే.. అందుకు భిన్నంగా షర్మిల మాత్రంచెలరేగిపోతున్నారు. తన తండ్రి మీద ఘాటు విమర్శలు చేసిన వేళలో కాస్తంత నిదానించిన ఆమె.. తాజాగా ఆ మాటలకు మరింత దూకుడుగా వ్యవహరించాలని డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. తాజాగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల జిల్లాకు వెళ్లిన ఆమె.. కరోనా బాధిత కుటుంబాల్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై సూటిగా విమర్శనాస్త్రాల్ని సంధించటం షురూ చేశారు. పేదలకు జబ్బు చేస్తే ఉచితంగా వైద్యం దక్కాలని భావించిన వైఎస్ ఆరోగ్య శ్రీని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉచిత వైద్యం పేదల హక్కుగా ఆమె అభివర్ణించారు. ఎవరూ ఆలోచించని తీరులో వైఎస్సార్ చేపట్టిన ఆరోగ్య శ్రీ సేవల్ని ప్రస్తావించటం ద్వారా కేసీఆర్ సర్కారుపై విమర్శల్ని సంధించారు.
కరోనాతో వేలాది మంది మరణించారని.. కరోనా వైద్యం ఖర్చులు భరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా? అని ప్రశ్నించిన ఆమె.. సీఎం కేసీఆర్ కు కరోనా వస్తే యశోదాలో చేరారని.. అదే పేదలకు వస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాలా? ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై కేసీఆర్ కు నమ్మకం లేదా అంటూ తప్పు పట్టారు.
కొందరు టీఆర్ఎస్ నాయకులు వైఎస్సార్ ను కించపరిచేలా మాట్లాడుతున్నారన్న షర్మిల.. తెలుగు ప్రజలకు వైఎస్సార్ అంటే ఏమిటో తెలుసన్నారు. ఆయన్ను ఏమైనా అంటే ఖబర్దార్.. ఊరుకునేదే లేదని వార్నింగ్ ఇచ్చారు.
షర్మిల తాజా వ్యాఖ్యల్ని చూస్తే.. తన తండ్రిని ఏమైనా అంటే ఊరుకునేది లేదన్న విషయాన్ని క్లియర్ చేయటంతో పాటు.. వైఎస్సార్ ను విమర్శించే వారి విషయంలో తన అన్న మాదిరి ఆచితూచి అన్నట్లు కాకుండా.. ఊపేక్షించేదే లేదన్న విషయాన్ని తాజాగా తేల్చేశారు.