Begin typing your search above and press return to search.
హుజూరాబాద్ లో పోటీపై షర్మిల సంచలన నిర్ణయం
By: Tupaki Desk | 18 July 2021 4:33 AM GMTఅసలు రాజకీయ పార్టీ లక్ష్యం ఏమిటీ..? ఎన్నికల్లో పోటీ పడి ప్రజల చేత మెప్పించుకొని గెలవాలి. అన్ని పార్టీలు అవే చేస్తాయి. ప్రజలను మెప్పించి గెలిచిన పార్టీనే అధికారంలోకి వస్తుంది. అన్ని పార్టీలు అదే చేస్తాయి. అయితే అందరిదీ ఓ దారి అయితే ఉలికిపిట్టది మరో దారి అన్నట్టు వైఎస్ షర్మిల మాత్రం ఉప ఎన్నికలపై సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో పార్టీ పెట్టి అధికార ప్రతిపక్షాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న వైఎస్ షర్మిల ఎన్నికల్లో పోటీకి మాత్రం ఏవేవో కారణాలు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్ టీపీ పార్టీని స్థాపించి తెలంగాణలో దూకుడుగా ముందుకెళుతున్న షర్మిలమ్మ ఈ క్రమంలోనే తెలంగాణలో వచ్చిన తొలి ఉప ఎన్నిక హుజూరాబాద్ పై సంచలన నిర్ణయం తీసుకున్నారు. పలు కండీషన్లు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ లో ఉప ఎన్నిక త్వరలో జరుగబోతోంది.అక్కడ బరిలో దిగేందుకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. తాజాగా తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల అక్కడ పోటీచేస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దీనిపై ట్విట్టర్ వేదికగా షర్మిల స్పందించారు. ‘హుజూరాబాద్ ఉప ఎన్నికల వల్ల ఎవరికి లాభం? ఏమైనా ఉపయోగం ఉందా? ఇక్కడ మేం పోటీచేయం. నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తాయా? దళితులకు మూడు ఎకరాలు భూమి వస్తుందా? ఇవన్నీ చేస్తామని చెబితే మేం కూడా పోటీచేస్తాం.. హుజూరాబాద్ ఉప ఎన్నిక పగ, ప్రతీకారంతో వచ్చిన ఎన్నికలు మాత్రమేనని’ షర్మిల చెప్పుకొచ్చారు.
పార్టీ నిలబడి తలపడితేనే షర్మిల శక్తి సామర్థ్యాలు తెలిసివచ్చేవి. కానీ ముందే అస్త్ర సన్యాసం చేసే వైదొలిగిన షర్మిల తీరు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.