Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: షర్మిల పార్టీ పెట్టడం జగన్ కు ఇష్టం లేదట.!
By: Tupaki Desk | 24 Feb 2021 2:13 PM GMTమొత్తానికి విషయం తేటతెల్లమైంది. అన్న చాటు చెల్లెలుగా ఇన్నాళ్లు ఉన్న వైఎస్ షర్మిల బయటపడ్డారు. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు అడుగులు వేస్తున్నారు. అయితే ఏపీ సీఎం జగన్ ను కాదని ఆమె వస్తున్నారా? అన్నయ్య జగన్ నిర్ణయం ఏంటనేది ఇన్నాళ్లు ఎవ్వరికీ అంతుబట్టలేదు. కానీ ఇప్పుడు వైఎస్ షర్మిల వ్యాఖ్యలతో జగన్ వైఖరి ఏంటో స్పష్టమైంది.
తాజాగా వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణలో పార్టీ పెట్టడం అన్నయ్య, ఏపీ సీఎం జగన్ కు ఇష్టం లేదని మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.తనకు పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్ నే అడగాలని మీడియా జర్నలిస్టులకు సూచించారు.తనకు అమ్మ విజయమ్మ మద్దతు ఉందని వైఎస్ షర్మిల తెలిపారు. తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికి లేదని.. కేసీఆర్, విజయశాంతి ఎక్కడి వారని షర్మిల ప్రశ్నించారు.
తాను తెలంగాణ కోడలినని.. అమరీవీరుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి గడపకు వెళ్తానని షర్మిల స్పష్టం చేశారు. తాను పెట్టబోయే కొత్త పార్టీపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈరోజు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిల విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.అన్నయ్య సీఎం జగన్ కు తాను పార్టీ పెట్టడం ఇష్టం లేదని షర్మిల చేసిన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీన్ని బట్టి వైఎస్ కుటుంబంలో విభేదాలు వచ్చాయని.. అన్నయ్యను ఎదురించి షర్మిల బయటకు వచ్చిందని తేటతెల్లమైంది.