Begin typing your search above and press return to search.
చేసుకున్నవారికి చేసుకున్నంత... షర్మిలకు సానుభూతి కరువైంది...!
By: Tupaki Desk | 1 Dec 2022 5:40 AM GMTరాజకీయాలైనా.. వ్యక్తిగతమైనా.. చేసుకున్నవారికి చేసుకున్నంత! అనే సామెత వినిపిస్తూ ఉంటుంది. తెలంగాణ రాజకీయాల్లోనూ ఇప్పుడు ఇదే మాట వినిపిస్తుండడం గమనార్హం. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అరెస్టు.. ఏకంగా కారుతోనే ఆమెను స్టేషన్‌కు తరలించడం..
అనంతరం కోర్టుకు హాజరుపరచడం తెలిసిందే. నిజానికి ఇదే ఘటన ఏపీలో జరిగి ఉంటే వేరేగా ఉండేది. కానీ, తెలంగాణలో జరిగింది. ఇదిలావుంటే.. అసలు ఒక పార్టీ అధ్యక్షురాలికి.. అందునా మహిళకు ఇంత జరిగినా.. ప్రజల నుంచి సానుభూతి రాకపోవడం గమనార్హం.
ప్రజలు పెద్దగా షర్మిల విషయాన్ని ప్రస్తావించలేదు. కొందరు పార్టీ నాయకులు తప్ప.. ఎవరూ కూడా ఈఘటనను సీరియస్‌గా తీసుకోలేదు. నిజానికి తెలంగాణ రాజకీయంగా ఏం జరిగినా వెంటనే స్పందించేవారు ఎక్కువగానే ఉన్నారు. కానీ, షర్మిల విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు.
దీనికి కారణం ఏంటి? ఎందుకు? అంటే.. చేసుకున్నవారికి చేసుకున్నంత అనే కామెంట్లు వినిపిస్తుండడం గమనార్హం. గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై ఆమె చేసిన వ్యాఖ్యలు..ప్రచారంలోకి వచ్చాయి.
ముఖ్యమంత్రితో సహా మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను షర్మిల నోటికొచ్చినట్లు తిట్టారనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను 420 అని, మగాళ్లు కాదా? మగతనం లేదా? అని గతంలో షర్మిల చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి. అంతేకాదు.. టీఆర్ ఎస్ మహిళా నేత, మాజీ ఎంపీ, కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై కూడా షర్మిల నోరు జారిన సందర్భాలు ఇప్పుడు ఆరు అంగుళాల మొబైల్ ఫోన్ల తెరపై వినిపిస్తున్నాయి.
ఈ పరిణామాలను గమనించిన వారు.. చేసుకున్నవారికి చేసుకున్నంత అని వదిలేస్తుండడం గమనార్హం. ఎందుకంటే.. సీఎం కేసీఆర్‌ను వ్యతిరేకించే సాధారణ ప్రజలు కూడా.. ఆయనను తిడితే సహించరు. పైగా..తెలంగాణ ఉద్యమం సమయంలో వైఎస్ అడ్డుపడ్డారనే వాదన ఉండనే ఉంది. తాను తెలంగాణ కోడలును అని చెప్పుకొన్నా షర్మిలను ప్రజలు ఇంకా రిసీవ్ చేసుకోలేదు. పైగా ఉద్యమ సమయంలో ఆమె ఎక్కడ ఉన్నారనే వాదన కూడా వినిపిస్తోంది. సో.. ఏతా వాతా ఎలా చూసుకున్నా.. షర్మిలకు సానుబూతి దక్కలేదని.. ఎపిసోడ్ మాత్రం హిట్టయిందని అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.