Begin typing your search above and press return to search.

కేసీఆర్ కుంభస్థలంపై షర్మిల గురి!

By:  Tupaki Desk   |   1 Jun 2021 2:30 PM GMT
కేసీఆర్ కుంభస్థలంపై షర్మిల గురి!
X
తెలంగాణ రాజకీయాల్లో దూసుకొచ్చిన వైఎస్ షర్మిల అడుగులకు బ్రేకులు వేసింది కరోనా వైరస్. దీని వల్ల వచ్చిన లాక్ డౌన్ తో షర్మిల రాజకీయం చేయకుండా అయిపోయింది. అయితే తెలంగాణలో కేసీఆర్ నే ఢీకొట్టాలని చూస్తున్న వైఎస్ షర్మిల అడుగులు ఇప్పుడు భారీగా పడబోతున్నాయని తెలుస్తోంది.

ఓ పూట లాక్ డౌన్ నిబంధనలకు మినహాయింపు ఇవ్వడంతో ఆ సమయంలో రాజకీయ పర్యటనలు చేయాలని నిర్ణయించుకున్నారట.. నేరుగా కేసీఆర్ తోనే ఢీకొట్టాలని డిసైడ్ అయ్యారట..ఇదివరకే తెలంగాణలో ప్రతిపక్షాలు వదిలేసిన నిరుద్యోగుల అంశాన్ని టేకప్ చేసిన షర్మిల జిల్లాల వారీగా దీక్షలకు పిలుపునిచ్చిన సమయంలో కరోనా విరుచుకుపడింది. దాంతో వాటికి బ్రేక్ పడింది.

ఉద్యోగాలు రావని ఆత్మహత్యలు చేసుకున్న వారిని పరామర్శించాలని వైఎస్ షర్మిల నిర్ణయించుకున్నారు. ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గాన్నే టార్గెట్ చేశారు. గజ్వేల్ లో కొంతమంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిని పరామర్శించడానికి బుధవారం గజ్వేల్ వెళ్తున్నారు.

వైఎస్ షర్మిల తెలంగాణలో తన పోరుబాటను ఏకంగా కేసీఆర్ నియోజకవర్గం నుంచే మొదలుపెట్టడం సంచలనమైంది. ముందుగా గన్ పార్క్ వద్ద నివాళులర్పించి భారీ ర్యాలీగా గజ్వేల్ కు వెళ్తారు. సాధారణంగా సీఎం నియోజకవర్గంలో చేస్తే అందరి ఫోకస్ ఉంటుంది. అందుకే షర్మిల ఏకంగా ఏనుగు కుంభస్థలాన్నే టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి షర్మిల పోరుబాట ఏమేరకు ఫలిస్తుందనేది వేచిచూడాలి.