Begin typing your search above and press return to search.
జగన్ వదిలిన బాణం దూసుకొస్తోంది!
By: Tupaki Desk | 28 Aug 2018 9:08 AM GMTఎవరు అవునన్నా.. కాదన్నా ఏపీ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక సంచలనంగా చెప్పాలి. సోనియా ముందు ఆత్మగౌరవంతో పోరాడిన అతి కొద్ది మందిలో జగన్ ఒకరన్నది మర్చిపోకూడదు. అధికార బలంతో తనను రాజకీయంగా అణిచివేసేందుకు కుట్ర పన్నుతారని తెలిసినా.. వెనక్కి తగ్గక.. వెరవకుండా కొండ లాంటి కాంగ్రెస్ ను ఢీ కొట్టిన ధీరుడు జగన్.
చాలామంది గుర్తించరు కానీ.. జగన్ ను టార్గెట్ చేయటం మొదలు పెట్టిన నాటి నుంచి సోనియా.. రాహుల్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యిందన్నది మర్చిపోకూడదు. కేసుల మీద కేసులు నమోదు కావటం.. జగన్ ను జైలు పాలు చేయటం వెనుక ఎవరున్నారు? ఏ అదృశ్య శక్తి పని చేసిందన్నది తెలిసిందే. సవాళ్లకు సై అనటమే కానీ.. రాజీ పడే తత్త్వం జగన్ లో అస్సలు కనిపించదు.
అలాంటి మొండితనం.. సూటిగా.. ప్రత్యర్థులకు తన మాటలతో చుక్కలు చూపించే సత్తా జగన్ సోదరి షర్మిల సొంతం. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుల కూతురిగా.. జగన్ కు ప్రాణసమానమైన సోదరిగా షర్మిలకు వైఎస్ ఇంట ప్రత్యేక స్థానం ఉందన్నది మర్చిపోకూడదు. కుట్రలతో జగన్ ను జైలుకు పంపిన వేళ.. పాదయాత్రతో పార్టీకి కీలకంగా మారటమే కాదు.. తాను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఆమె చేసిన ప్రసంగాలకు తెలుగు ప్రజలు జైజేలు కొట్టేవారు.
అయితే.. 2014 ఎన్నికల్లో తన కుటుంబ సభ్యుల్ని ఎన్నికల బరిలోకి దింపలేదు జగన్. తన తల్లిని విశాఖ ఎంపీ బరిలో దింపారు. ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఆమె రాజకీయాలకు దూరంగా ఉండటం షురూ చేశారు. ఇక.. జగన్ మినహా వైఎస్ ఫ్యామిలీ నుంచి మరెవరూ రాజకీయాల్లో రాని పరిస్థితి. ఇదిలా ఉండగా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన సోదరి షర్మిలను ఎన్నికల బరిలోకి దింపాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఆమెను లోక్ సభ ఎన్నికల్లో దించుతారని చెబుతున్నారు. రాజంపేట కానీ ఒంగోలు ఎంపీ స్థానం నుంచి షర్మిల బరిలోకి దిగుతారని చెబుతున్నారు. ఉరకలెత్తే ఉత్సాహంతో.. పదునైన విమర్శలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే షర్మిల వైఎస్సార్ కాంగ్రెస్ కు అదనపు బలం అవుతారని చెప్పాలి. గతంలో పోలిస్తే.. జగన్ రాజకీయంగా మరింత రాటు తేలిన నేపథ్యంలో రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి షర్మిలను దించుతారని చెబుతున్నారు. మహిళల్లోనూ.. యువతలోనూ షర్మిలకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంటుందన్నది మర్చిపోకూడదు. జగనన్న వదిలిన బాణంగా దూసుకొచ్చిన షర్మిల గతంలో 2500 కిలోమీటర్ల పాదయాత్ర చేయటాన్ని మర్చిపోలేం. మళ్లీ ఆమె యాక్టివ్ కానున్నారన్న వార్త.. వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలకు స్వీట్ న్యూస్ గా మారుతుందనటంలో సందేహం లేదు.