Begin typing your search above and press return to search.
షర్మిల vs కాంగ్రెస్: వైఎస్ఆర్ సెంటిమెంట్ ఎవరికి?
By: Tupaki Desk | 9 July 2021 10:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల దూసుకొచ్చారు. కొత్త పార్టీతో ముందుకెళుతున్నారు. దివంగత వైఎస్ఆర్ కూతురుగా.. ఆయన చేసిన సంక్షేమ పాలనను తిరిగి తెస్తానంటున్నారు. తండ్రి ఆశయాలు సాధించడం.. రాజన్న రాజ్యాన్ని మళ్లీ నెలకొల్పడమే ధ్యేయంగా ముందుకెళుతున్నారు. సంక్షేమం, సమానత్వం, స్వయం సంవృద్ధి ధ్యేయమని ప్రకటించారు.
షర్మిలకు రాజకీయాలు ఏం కొత్తేం కాదు.. జగన్ జైలుకు వెళ్లినప్పుడు వైసీపీని దిగ్విజయంగా నడిపించారు. 3వేల కి.మీలకు పైగా పాదయాత్ర చేసి వైసీపీని బతికించారు. ఇకపోయిన ఎన్నికల్లోనూ వైసీపీ తరుఫున ప్రచారం చేసి ప్రచార సభల్లో చంద్రబాబు, లోకేష్ లపై పంచుల వర్షం కురిపించారు. అన్నయ్య ఏపీలో సీఎం అయ్యాక షర్మిలకు ప్రాధాన్యం దక్కలేదు. అందుకే అన్నకు పోటీగా ఏపీలో రాజకీయం చేయలేక తెలంగాణ రాజకీయాలను ఎంచుకున్నారు. ఒంటరిగానే ముందుకెళుతున్నారు.
వైఎస్ఆర్ పేరు, ఆయన పరపతి, చరిష్మానే ఇప్పుడు షర్మిల పార్టీకి పునాదులుగా మారింది. అంతకుమించిన బలం బలగం షర్మిలకు ఏమీ లేదు. షర్మిల ఇప్పటిదాకా అసెంబ్లీకి, పార్లమెంట్ కు పోటీచేయలేదు. చట్టసభల్లోనూ అడుగు పెట్టలేదు. కొత్తగా పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ఇప్పుడే వచ్చారు.
అయితే తెలంగాణలోనూ వైఎస్ఆర్ కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. వైఎస్ఆర్ చేసిన సంక్షేమ పథకాల లబ్ధి పొంది ఆయనకు అభిమానులుగా స్థిరపడ్డారు. చరిష్మా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అలాంటి బలమైన ఓటు బ్యాంక్ ను షర్మిల టార్గెట్ చేశారు. జిల్లాల వారీగా వైఎస్ఆర్ అభిమానులతో భేటి అయ్యారు. వారిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. వారంతటిని ఓట్లుగా మలుచుకోగలిగితే షర్మిల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది.
అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ సీఎం. ఆయన కాంగ్రెస్ లోనే ఎదిగారు. ఇప్పటికే కాంగ్రెస్ వాదిగానే ఆయనను కాంగ్రెస్ నేతలు ఓన్ చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సైతం వైఎస్ఆర్ మా వాడే అన్నాడు. దీంతో వైఎస్ఆర్ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు పోతుందా? లేక షర్మిల వైపు మళ్లుతుందా? అన్నది ఆసక్తి రేపుతోంది.
అయితే ఏపీలో వైఎస్ఆర్ ను కాంగ్రెస్ వాదిగా చూపిన ఆ పార్టీ ప్రయత్నాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. వైసీపీ అధినేత జగన్ కే ఆ ఓటు బ్యాంకు అంతా షిఫ్ట్ అయ్యింది. వైసీపీకే వైఎస్ఆర్ ను సొంతం చేసి ప్రజలు ఓట్లు వేశారు. మరి ఇక్కడ తెలంగాణలో అలా జరుగుతుందా? పునరావృతమవుతుందా? వైఎస్ఆర్ ఓటు బ్యాంకును షర్మిల గంపగుత్తగా లాగేస్తుందా? అన్నది వేచిచూడాలి. ఏపీలో లాగా బలహీనంగా తెలంగాణలో కాంగ్రెస్ లేకపోవడమే షర్మిలకు మైనస్ గా మారింది. మరి ఏం జరుగుతుందనేది భవిష్యత్ లోనే తేలనుంది.