Begin typing your search above and press return to search.
పాలేరులో పరాభవమే.. షర్మిలమ్మా!!
By: Tupaki Desk | 25 Dec 2022 3:30 PM GMTవచ్చే తెలంగాణ ఎన్నికల్లో తాను ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రకటించారు. అంతేకాదు.. ఈ మట్టిపై ఒట్టేసి చెబుతున్నా.. అంటూ కొంత సెంటిమెంటును కూడా రంగరించారు. పోటీ చేయడానికి ఒట్టెందుకు? అంటూ నెటిజన్లు అప్పట్లోనే విరుచుకుపడ్డారు. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఒట్టేసి చెబుతున్నా.. అంటే నమ్ముతారని వ్యాఖ్యానించారు.
కట్ చేస్తే.. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. మరో 10 నెలల్లోనే ఎన్నికలు వున్నా యి. ఈ క్రమంలో పాలేరు రాజకీయాలు కూడా అంతే వేగంగామారుతున్నాయి. పాలేరు అంటే.. అంత ఈజీ నియోజకవర్గం కాదు. ఇక్కడ కొన్నేళ్ల పాటు టీడీపీ విజయం దక్కించుకుంది. తర్వాత.. కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపారు. పాలేరు నుంచి గతంలో టీడీపీ తరఫున తుమ్మల నాగేశ్వరరావు విజయం దక్కించుకున్నారు.
తుమ్మల హవానే కొనసాగింది. అయితే.. 2018 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. అయితే.. కాంగ్రెస్ తరఫున గెలిచిన ఉపేందర్‌రెడ్డి కూడా.. ప్రస్తుతం టీఆర్ ఎస్‌లో ఉన్నారు. అంటే.. ఆయనకు ఖచ్చితంగా టీఆర్ ఎస్ పాలేరు టికెట్ కేటాయిస్తుంది.
ఇక, తుమ్మల బలంగా ఉండడంతోపాటు.. బీఆర్ ఎస్‌తో తెగతెంపులు చేసుకుని బయటకు వస్తే.. ఆయనను తీసుకునేందుకు టీడీపీరెడీగా ఉంది.
అంటే.. ఆయన నిర్ణయం తీసుకుంటే.. టీడీపీ అభ్యర్థి తుమ్మలే అవుతారు. ఇక్కడితో కథ అయిపోలేదు. తమకంచుకోట వంటి నియోజకవర్గాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థి కోసం వేట సాగిస్తోంది. ఎవరూ కుదరకపోతే.. రేణుకా చౌదరి పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఈమె ఎంత ఫైర్ బ్రాండో అందరికీ తెలిసిందే. ఇక, బీజేపీ కూడా ఇక్కడ బలంగానే పోటీ పడనుంది.
వెరసి మొత్తంగా.. ఒక్క నియోజకవర్గంలో బలమైన ఐదుగురు అభ్యర్థులు పోటీకి రెడీ అవుతున్నారు. వీరి మధ్య కొత్త పార్టీ పెట్టుకుని.. ఎలాంటి సెంటిమెంటులేకుండా.. కనీసం పాలేరుతోసంబంధం కూడా లేకుండా..రెడ్డి అనే ట్యాగ్‌తో షర్మిల పోటీ చేసినా.. పరాభవం తప్పదేమో అంటున్నారు పరిశీలకులు.