Begin typing your search above and press return to search.
ట్రాక్టర్ నడపడం ఓకే : రాజన్నరాజ్యం తీసుకొస్తారా...?
By: Tupaki Desk | 8 Jun 2022 11:30 AM GMTనిన్న అన్న నేడు చెల్లి ఇద్దరూ ఒకే ఫీట్ చేశారు. తమ పార్టీ వారికి హుషార్ తెచ్చారు. అటు వైసీపీ ఇటు వైఎస్సార్ టీపీ అధినేతలు వీరు. అసలు ఇంతకీ ఏమా కధ, వారు ఏం చేశారు అన్నది చూస్తే ఏపీ సీఎం గా జగన్ నిన్న ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్సార్ యంత్ర సేవా పధకాన్ని ప్రారంభిస్తూ ముఖ్యమంత్రిగా ట్రాక్టర్ ఎక్కేశారు. చుట్టూ రైతు సంఘాల నాయకులను కూర్చోబెట్టుకుని పచ్చ కండువా భుజాన వేసుకుని చేసిన హడావుడి మీడియాలో భలేగా ఫోకస్ అయింది.
తాను రైతు బాంధవుడిని, కషకుల కష్టాలు తీర్చే శ్రామికుడిని అంటూ ఆనక జగన్ కీలక ప్రసంగం కూడా చేశారు. సీన్ కట్ చేస్తే ఈ రోజు తెలంగాణా గడ్డ మీద ఆ అన్న చెల్లెలుగా వైఎస్ షర్మిలమ్మ కూడా ట్రాక్టర్ ఎక్కారు. ఆమె ఏకంగా పొలంలోకే ట్రాక్టర్ పరుగులు పెట్టించారు. ఆమె కూడా రైతుల కోసమే అన్నట్లుగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
ఇలా దివంగత వైఎస్సార్ వారసులు ఇద్దరూ దాదాపు ఒకే తీరున రైతన్నల గురించి స్పందించడం ట్రాక్టరెక్కి ఫోజులివ్వడం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో వైఎస్సార్ అభిమానులతో పాటు సాదర జనాన్ని కూడా ఆకట్టుకున్న దృశ్యాలే అయ్యాయి. రైతన్న అంటే వైఎస్సార్ గుర్తుకువస్తారు.
ఆయన ఇప్పటికి పద్దెనిమిది ఏళ్ల క్రితం వారికి ఉచిత విద్యుత్ ఇస్తామంటూ ముఖ్యమంత్రిగా తొలి ఫైల్ మీద సంతకం పెట్టిన దగ్గర నుంచి ఊపిరాగేవరకూ వారికోసమే పాటుపడ్డారు. అలాంటి వైఎస్సార్ మరణించాక రైతులకు ఆ స్థాయిలో ఆదరించే ఆపన్న హస్తం తెలుగు రాష్ట్రాలలొ అయితే ఏ కోశానా దక్కలేదు అన్నది నిష్టుర సత్యం.
ఇక ఆయన వారసులుగా తండ్రి బాటలో నడుస్తామని చెబుతున్న జగన్ ఏలుబడిలో అయితే రైతులకు ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. వారి కన్నీళ్ళు పూర్తిగా తుడవాల్సి ఉంది. వారికి అన్ని రకాలుగా మేళ్ళు చేసినట్లు అయితేనే రాజన్న రాజ్యం వచ్చినట్లుగా లెక్క.
ఇక షర్మిలమ్మ తెలంగాణాలో రాజన్న రాజ్యం అంటున్నారు. తండ్రి హావభావాలను పుణికిపుచ్చుకున్న ఆమె రైతులకు తాను అండగా ఉంటాను అని చెప్పుకుంటున్నారు. అయితే ఆమెకు అధికారం దక్కుతుందా లేదా అన్నది పక్కన పెడితే రాజన్నబిడ్డగా రాజన్న రాజ్యం వస్తే తెస్తాను అని చెప్పి జనాలను ఒప్పించుకునే నాయకత్వ సమర్ధత గురించే అంతా అలోచన చేస్తున్నారు. ముందు ఆమె తన సత్తా ఆ విధంగా చాటుకుంటే రాజన్న రాజ్యానికి ద్వారాలు తెరచినట్లే.