Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ దుకాణం మూసేద్దామా: చిద్దూ వ్యాఖ్యలపై శర్మిష్ట
By: Tupaki Desk | 12 Feb 2020 4:51 PM GMTఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. దాదాపు 54 శాతం ఓటు బ్యాంకుతో 62 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 8 సీట్లే గెలుచుకున్నప్పటికీ గతంలో కంటే 7 శాతం మెరుగుబడి 39 శాతం ఓట్ షేర్ ను దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల్లో కాంగ్రెస్ మాత్రమే కేవలం 4.26 శాతంతో చెత్త ప్రదర్శన చేసింది. 2015లో - ఇప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మళ్లింది. బీజేపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇదే.
కాంగ్రెస్ దారుణ పరాభవం ఆ పార్టీ నేతలకు ఆందోళన కలిగిస్తోంది. ప్రాంతీయ పార్టీలకు తోక పార్టీగా మారిపోతున్నామా అని సొంత పార్టీ నేతలో బహిరంగంగా వ్యాఖ్యానించే పరిస్థితికి వెళ్లింది. ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే.. ఎన్నికల్లో గెలిచిన కేజ్రీవాల్ కు అభినందించిన సీనియర్ నేతపై మరో సీనియర్ నేత ఆగ్రహించే పరిస్థితి వచ్చింది. సాధారణంగా ఓడిపోయినప్పటికీ పరస్పరం అభినందించుకుంటారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం... ఆమ్ ఆద్మీ పార్టీని ప్రశంసించిన తీరు సొంత పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పించింది.
బీజేపీ విభజన రాజకీయాలు - ప్రమాదకర అజెండాను ఢిల్లీ ప్రజలు ఓడించారని - కేజ్రీవాల్ మూడోసారి సీఎంగా ఎన్నిక కావడం ఆయన పని తీరుకు నిదర్శనమని - ఢిల్లీ ప్రజలకు సెల్యూట్ అని కాంగ్రెస్ లో కీలక నేత అయిన చిద్దూ ప్రశంసించారు. ఆయన ప్రశంసించిన తీరుపై సొంత పార్టీ నేత శర్మిష్టా ముఖర్జీ మండిపడ్డారు.
బీజేపీని ఓడించే పనిని కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలకు అప్పగించిందా, అలా కాదని చెబితే కనుక మన పార్టీ ఓటమిపై ఆందోళన చెందకుండా కేజ్రీవాల్ విజయాన్ని ఆనందించడం ఏమిటని శర్మిష్టా ముఖర్జీ విమర్శలు గుప్పించారు. బీజేపీని ఓడించే బాధ్యతను ప్రాంతీయ పార్టీలకు అప్పగించడం నిజమే అయితే మన దుకాణాలను (కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖలను) మూసివేయడం మంచిదని సెటైర్ వేశారు.
130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇటీవల వరుస పరాజయాలు ఎదుర్కొంటుంది. ఒకటి రెండు రాష్ట్రాల్లో గెలుపు తాత్కాలిక ఊరట.. అదీ ఒకటి రెండు సీట్ల మెజార్టీతో మాత్రమే గెలిచి ఊరట పొందుతోంది. కర్ణాటకలో తక్కువ సీట్లు గెలిచిన ప్రాంతీయ పార్టీ జేడీఎస్ కు సీఎం పదవిని అప్పగించింది. మహారాష్ట్రలో శివసేనకు మద్దతు పలికింది. మధ్యప్రదేశ్ - రాజస్థాన్ లలో బొటాబోటీ మెజార్టీతో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ దాదాపు ఖాళీ అయింది. తెలంగాణలో రెండో స్థానం కోసం బీజేపీ పోటీ పడుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి ప్రాంతీయ పార్టీలకు తోక పార్టీగా తయారయిందనే విమర్శలు ఎదుర్కొంటోంది.