Begin typing your search above and press return to search.
దుబ్బాక ఎమ్మెల్యే ఎవరో ఎందుకు ప్రకటించలేదో తెలుసా?
By: Tupaki Desk | 10 Nov 2020 5:30 PM GMTతెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠను రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం వెలువడిన సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారని అన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. ఏకంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించి తమ ఓటమిని ఒప్పుకొంటున్నట్లు ప్రకటించేశారు. అయితే ఇప్పటి వరకూ ఎమ్మెల్యేగా గెలుపొందింది ఎవరూ అనే విషయంలో అధికారిక ప్రకటన వెలువడలేదు. దీనికి ఎన్నికల కమిషన్ సీఈవో శశాంక్ గోయల్ క్లారిటీ ఇచ్చారు.
తుది ఫలితం వెలువడటంలో జరుగుతున్న జాప్యంపై ఆయన స్పందిస్తూ, కరోనా నిబంధనలు పాటించడం వల్లే కౌంటింగ్ ప్రక్రియ కాస్త ఆలస్యం అవుతుందని వివరణ ఇచ్చారు. ఈవీఎంలు మొరాయించినా బెల్ టెక్నికల్ ఇంజనీర్లు అందుబాటులోనే ఉన్నారని వెల్లడించిన ఆయన కరోనా నిబంధనలు పాటించడం వల్లే గతంతో పోలిస్తే ఎన్నికల ఫలితాలు వెలువడడంలో జాప్యం జరుగుతోందన్నారు. ఒకవేళ ఈవీఎంలు తెరుచుకోక పోతే చివరిగా వివిఫ్యాట్స్ ఓపెన్ చేస్తామని.. ఈవీఎంల కౌంటింగ్ ముగిసిన తరువాత ఒక ఐదు వీవీ ఫ్యాట్ బాక్సులను లెక్కిస్తామని వెల్లడించారు. ఇక, రాజకీయ పార్టీల ఏజెంట్ల సమ్మతితో రౌండ్ల వారిగా ఓట్ల వివరాలు ప్రకటిస్తున్నామని వెల్లడించారు
దుబ్బాకలో 25వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ 1079 ఓట్ల ఆధిక్యంలో ఉందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ తెలిపారు. 136, 157/A పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ తర్వాత క్లియర్ చేయలేదన్న ఆయన…ఆ రెండు పోలింగ్ కేంద్రాల్లో 897 ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఇక లెక్కించాల్సిన ఓట్ల కన్నా మెజారిటీ ఎక్కువ ఉంది కాబట్టి నిబంధనల ప్రకారం ఆ రెండు పోలింగ్ కేంద్రాల్లో లెక్కింపు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. నమూనా వీవీప్యాట్ స్లిప్పుల తనిఖీ ప్రక్రియ పూర్తయ్యాక అధికారికంగా గెలుపు ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుందని స్పష్టం చేశారు.