Begin typing your search above and press return to search.
హిల్లరీతో శశిథరూర్.. ఫోటోపై సెటైర్లు!
By: Tupaki Desk | 28 July 2016 4:45 AM GMTఈ మధ్యకాలంలో ఏస్థాయి సెలబ్రెటీ అయినా, లెజెండ్ అయినా... కాస్త తేడాగా ప్రవర్తించినా, వారివారి విషయాల్లో చట్టం చుట్టమయ్యే సందర్భాలోచ్చినా... నెట్ జన్లు సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. పార్లమెంటులో నిద్రపొతూ కనిపించిన రాహుల్ పైనా - కృష్ణ జింకల కేసునుంచి బయటపడిన సల్మాన్ పైనా.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లే ఉన్నాయి. తాజాగా వారి కీ బోర్డు కి ఒక సీనియర్ కాంగ్రెస్ నేత దొరికారు!
కేరళకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత - మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ తాజాగా ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో.. ఒక మేజర్ నేషనల్ పార్టీ నుంచి మొదటిసారిగా ఒక మహిళ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిలవడాన్ని తాను స్వాగతిస్తున్నాని... హిల్లరీ క్లింటన్ కు శుభాకాంక్షలు చెప్పాడు. అది అక్కడితో ఆగితే బాగుండెదేమో.. ఆ పదాల కింది ఒక ఫోటో జతపరిచాడు. ఇప్పుడు ఆ ఫోటోపైనే శశిధరూర్ నెటిజన్లకు దొరికిపోయారు.
శశిధరూర్.. హిల్లరీ క్లింటన్ ముఖంలో ముఖం పెట్టి మాట్లాడుతున్నట్లు (కిస్ చేయడానికి అన్నట్లు) ఆ ఫోటో కనిపించడంతో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
* ఈయనకు ఇంతకంటే మంచి ఫోటో దొరకలేదా?
* ఫొటో మార్చండి సార్..
* శశి టేస్ట్ అదే
* మరో కాంగ్రెస్ లోకి వెళ్లడానికి ఇదే మంచి అవకాశమేమో?
* శుభాకాంక్షలు చెప్పడానికి అంతకు మించిన స్టిల్ దొరకలేదా?
* మీరు ఏమి చేయాలనుకుని అంత దగ్గరకు వెళ్తున్నారు? అని నెటిజన్లు కామెంట్స్ విసురుతున్నారు.
కాగా తన భార్య సునంద పుష్కర్ మృతి కేసులో శశిథరూర్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటోన్నారు. శశిథరూర్ కు పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరార్ తో సంబంధాలనున్నాయని సోషల్ మీడియాలో స్వయంగా ప్రకటించిన తర్వాతి రోజే సునంద అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే!