Begin typing your search above and press return to search.
కాకరకాయ..కీకరకాయ సామెతెను గుర్తు చేసిన థరూర్ ట్వీట్
By: Tupaki Desk | 24 Sep 2019 7:22 AM GMTచదువు లేనప్పుడు కాకరకాయ అన్నోడు.. చదువుకున్నాక కీకరకాయ అన్నాడంటూ వ్యంగ్యంగా చెప్పే సామెతకు తగ్గట్లే తాజాగా మాజీ కేంద్రమంత్రి శశి థరూర్ ట్వీట్ ముచ్చట ఉందని చెప్పాలి. మేధావిగా పేరున్న ఆయన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. తన భార్య అనుమానాస్పద మరణం నేపథ్యంలో ఆయన ఇమేజ్ భారీగా మసకబారింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన చేసిన ట్వీట్.. పలువురు చేత చీవాట్లు తినేలా చేస్తోంది.
మోడీ అమెరికా టూర్ నేపథ్యంలో అక్కడి ప్రవాస భారతీయులు భారీ ఎత్తున కదలిరావటం.. మోడీకి అనుకూలంగా నినాదాలు చేయటంతో పాటు.. ఆయనకున్న ఆదరణ ఎంత భారీగా ఉందన్న విషయాన్ని బీజేపీ గొప్పగా ప్రమోట్ చేసుకుంటున్న వేళ.. కాంగ్రెస్ వాది అయిన శశిథరూర్ కు ఏ మాత్రం మింగుడుపడటం లేదన్నట్లుగా ఆయన తాజా ట్వీట్ ఉందని చెప్పాలి.
ఎందుకంటే నెహ్రూ.. ఇందిరలతో కూడిన ఒక ఫోటోను ఆయన పోస్ట్ చేశారు. ట్విట్టర్ లోని తన ఖాతాలో పోస్ట్ చేసిన ఈ ఫోటోకు క్యాప్షన్ గా ఆ చిత్రం 1954లో తండ్రికూతుళ్లు ఇద్దరూ అమెరికాకు వెళ్లిన సందర్భంగా తీసిన ఫోటోగా పేర్కొన్నారు. ఇంతకీ ఆ ఫోటో చెప్పేదేమంటే.. ఇప్పటి మాదిరి అప్పట్లో మీడియా ప్రచారం లేకున్నా.. ఎన్నారైలు పాల్గొనకున్నా.. వారిద్దరి కోసం ఎంత భారీగా అమెరికా ప్రజలు ఉత్సాహంగా వచ్చారో చూడాలంటూ ఆయన ట్వీట్ చేశారు.
అయితే.. ఈ ట్వీట్ లో రెండు తప్పులు దొర్లటంతో.. నెటిజన్లు ఆయనకు పంచ్ ల మీద పంచ్ లు ఇస్తున్నారు. థరూర్ చేసిన రెండు తప్పులు ఆయనకు చీవాట్లు పెట్టేలా చేస్తున్నాయి. ఎందుకంటే.. ఆ రెండు తప్పులు పెద్దవి కావటమే కారణం. అందులో మొదటి తప్పు ఇందిరా గాంధీని ఇండియా గాంధీగా పేర్కొనటం అయితే.. రెండోది ఆ ఫోటో అమెరికాకు వెళ్లినప్పటిది కాదు సోవియెట్ యూనియన్ లో పర్యటించిన సందర్భంగా తీసినది.
ఈ రెండు తప్పులతో థరూర్ ను నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. మోడీ అమెరికా పర్యటనను తక్కువ చేసి చూపించటం కోసం పెద్ద మనిషి చేసిన ప్రయత్నం ఫెయిల్ అయ్యిందంటూ ఎద్దేవా చేస్తున్నారు. తన తప్పును కవర్ చేసేందుకుఆయన ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఏమన్నారంటే.. తాను పోస్ట్ చేసిన ఫోటో ఫార్వర్డెడ్ ఫోటో అని.. అమెరికాకు బదులుగా సోవియెట్ యూనియన్ లో తీసిన ఫోటోనే కావొచ్చు..కానీ నా అభిప్రాయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదన్నారు. మోడీయే కాదు.. మాజీ ప్రధానులందరికి విదేశాల్లో మంచి పాపులార్టీ ఉందని చెప్పటమే తన ఉద్దేశంగా చెప్పారు. మొత్తంగా ఏదో చెప్పాలనుకొని.. మరేదో చెప్పే ప్రయత్నంలో అడ్డంగా బుక్ అయ్యారని మాత్రం చెప్పక తప్పదు.