Begin typing your search above and press return to search.
మరో మాజీ కేంద్రమంత్రికి పొంచి ఉన్న అరెస్ట్ ముప్పు!
By: Tupaki Desk | 22 Aug 2019 5:05 AM GMTఆసక్తికర వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు. ప్రస్తుతం తిరువనంతపురం లోక్ సభ సభ్యుడిగా వున్నారు శశిథరూర్. సినీ నటులు.. సెలబ్రిటీలకు బదులుగా.. ఒక రాజకీయ నేత అందం గురించి అదే పనిగా చర్చ సాగటం.. ఆ దిశగా గుర్తింపు లభించటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి ఇమేజ్ ను సొంతం చేసుకున్న నేతగా శశి థరూర్ ను చెబుతారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఒక కశ్మీరీ యువతిని పెళ్లాడిన థరూర్.. అనూహ్యంగా ఆమె మరణానికి సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన ఫ్యూచర్ మీద నీలి నీడలు కమ్ముకునే పరిణామం ఒకటి చోటు చేసుకుంది. సునంద పుష్కర్ అనుమానాస్పద మరణానికి సంబంధించిన విచారణ ఒకటి తాజాగా ఢిల్లీ కోర్టులో జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు వినిపించిన వాదనలు శశిథరూర్ కు ఇబ్బందిగా మారాయి.
సునంద పుష్కర్ హఠాన్మరనానికి సంబందించి థరూర్ ను వేలెత్తి చేపేలా సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నట్లుగా ఢిల్లీ పోలీసులు కోర్టు దృష్టికి తెచ్చారు. సునంద అనుమానాస్పద మరణంపై సాగుతున్న వాదనల సమయంలో థరూర్ ఇరుకున పడేలా ఢిల్లీ పోలీసుల వాదనలు ఉన్నట్లు చెబుతున్నారు. పాకిస్థాన్ కు చెందిన జర్నలిస్టుతో థరూర్ కు సన్నిహిత సంబంధాలు ఉండటం.. వీరి మధ్య సాగిన రొమాంటిక్ మెసేజ్ లను చూసిన తర్వాత సునంద కోపాన్ని తట్టుకోలేకపోయినట్లుగా చెబుతున్నారు.
భార్యభర్తల మధ్య విబేధాలు తీవ్రస్థాయికి చేరుకున్న పర్యవసానమే సునంద మరణమన్న అనుమానాలు అంతకంతకూ బలపడుతున్నాయి. తోపులాట కారణంగా సునంద శరీరంపై మొత్తం 15 చోట్ల బలమైన గాయాలు ఉన్నట్లుగా పోలీసులు గతంలోనే ఛార్జ్ షీటు దాఖలు చేశారు. ఢిల్లీ పోలీసుల తాజా వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రమంత్రి చిదంబరం తర్వాత అరెస్ట్ ముప్పును థరూర్ ఎదుర్కొనే ప్రమాదం ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి.