Begin typing your search above and press return to search.
మౌనమె 'శశి'భాష ఓ మూగ మనసా....
By: Tupaki Desk | 20 Jan 2015 6:47 AM GMTఎంత ఆధునిక తరపు రాజకీయవేత్త అయినప్పటికీ... శృంగార ప్రియ లాలసుడు అయినప్పటికీ... జన్మమూలాల పరంగా కేరళీయుడైన కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌కు సంగీత ప్రియత్వం లేదా పరిచయం ఉండదని అనుకోలేం. పైన మనం అనుకున్న కీర్తనలోని అంతరార్థాన్ని ఆయన ఎలా బోధపరచుకున్నారో ఏమో గానీ.. మొత్తానికి పోలీసుల విచారణ సమయంలో మాత్రం దాదాపుగా మౌనవ్రతమే పాటించారు. ముచ్చటగా మనువాడిన తన మూడో భార్య... అనుమానాస్పద స్థితిలో హోటలు గదిలో మరణిస్తే... తక్షణం ఆమె అంత్యక్రియలను హడావిడిగా పూర్తి చేయించేసిన అప్పటి కేంద్రమంత్రి గారు... తాజాగా ఆ ఉదంతానికి సంబంధించి కేసు మరియు విచారణ మళ్లీ మెడకు చుట్టుకుంటుందని ఊహించి ఉండకపోవచ్చు. సునందది హత్యే అని నిర్ధరణ అయిన తర్వాత.. అప్పటికే ఆమెనుంచి అక్రమ సంబంధాల ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్తగా శశిథరూర్ మీదకు అనుమానాలు మళ్లడం సహజం. దానికి తగినట్లుగానే... ఆమెది హత్యే అని తేలిన వెంటనే... అనారోగ్యం పేరిట ఆస్పత్రిని ఆశ్రయించడం ద్వారా శశిథరూర్ అనుమానించగల వాళ్లకి మరింత ఆస్కారం కల్పించాడు కూడా! ఏతావతా.. దేశవ్యాప్తంగా ప్రజలందరిలోనూ ఆయన మీద అనుమానాలు మాత్రం ప్రబలిపోయాయి.
ఇక ఎటూ తప్పుకునే దార్లు మూసుకుపోయాయి అని ఖరారైన తర్వాత.. ఢిల్లీ పోలీసుల ఎదుట విచారణకు థరూర్ వచ్చారు. అక్కడికి రావడానికి ముందుగా.. తన న్యాయవాదులందరినీ పిలిపించుకుని.. పోలీసు ప్రశ్నలు ఎలా ఉండగలవో.. ఎలాంటి సమాధానాలతో క్షేమంగా బయటకు రావచ్చో.. కాస్తంత శిక్షణ తీసుకుని మరీ ఆయన విచారణకు వెళ్లారు. బహుశా ఆయన ప్రిపేర్ అయిన ప్రశ్నలు వచ్చినప్పుడు ప్రిపేర్ అయిన మేరకు, మరియు చిరునవ్వులతో జవాబులు ఇచ్చిన థరూర్... ప్రిపరేషన్‌లో లేని మెజారిటీ ప్రశ్నలకు నోరు మెదపకుండా మౌనం పాటించినట్లుగా వార్తలు వస్తున్నాయి. వాస్తవాలను రాబట్టడానికి పోలీసుల వద్ద అనేక మార్గాలు ఉంటాయి. ఒక్కో తరహా వ్యక్తులకు ఒక్కోమార్గం వర్తిస్తుంది. శశిథరూర్‌కు కాస్త టాప్‌క్లాస్ ట్రీట్‌మెంట్ దక్కి ఉండవచ్చు... ఆయన మీద లాఠీ విరిగి ఉండకపోవచ్చు... మాజీ కేంద్రమంత్రి అనే హోదా ఆయనకు ఒక కవచంగా నిలిచి ఉండవచ్చు. కానీ ఆ కవచం శాశ్వతం కాదని ఆయన గుర్తుంచుకోవాలి. పాటించిన మౌనం.. శ్రీరామరక్ష కాదని ... అనుమానాల్ని పెంచేదని ఆయన తెలుసుకోవాలి. ఇప్పుడు ఇలా మౌనం పాటించడం వలన.. 'సెకండ్ రౌండ్' విచారణ శశిథరూర్‌కు తప్పదని పలువురు విశ్లేషిస్తున్నారు. ఈలోగా ఇతర మార్గాల్లో వారికి మరికొన్ని వివరాలు సేకరిస్తే.. సెకండ్‌రౌండ్... ఆయనకు మౌనభాషను ఆశ్రయించే అవకాశం ఇవ్వనంత ఘాటుగానే ఉంటుందని పలువురు అంటున్నారు.