Begin typing your search above and press return to search.

వ్యాక్సినేషన్ పై కరోనా బెడ్ మీద నుండే శశిథరూర్ విమర్శలు !

By:  Tupaki Desk   |   2 Jun 2021 11:30 AM GMT
వ్యాక్సినేషన్ పై కరోనా బెడ్ మీద నుండే శశిథరూర్ విమర్శలు !
X
దేశంలో కేంద్రం కొనసాగిస్తోన్న కరోనా వ్యాక్సినేషన్ విధానంపై కాంగ్రెస్ నేత శిశిథరూర్ మరోసారి తీవ్రమైన విమర్శలు చేశారు. కరోనా తో పోరాడుతూ బెడ్ పై నుండే ఆయన ఈసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఏప్రిల్ లో కరోనా కి గురై, ప్రస్తుతం కోలుకుంటున్న ఆయన, తను చికిత్స పొందుతున్న ఆసుపత్రి బెడ్ పై నుంచే మాట్లాడారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. కోవిడ్ నుంచి ఇండియాను కాపాడండి, ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వండి అని ఆయన కోరారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ డిసెంబర్ కల్లా వ్యాక్సినేషన్ ఇస్తామనే గడువుకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని అన్నారు. రాష్ట్రాలే వ్యాక్సిన్ సేకరించుకోవాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని శశిథరూర్ అన్నారు.

కేంద్రం ఇస్తున్న హామీ బాగానే ఉందని, కానీ భారతీయులందరికీ టీకామందులు ఇచ్చేందుకు అనువుగా యూనివర్సల్ వ్యాక్సినేషన్ కి పర్మిట్ ఇచ్చేలా ప్రభుత్వ పాలసీలో మార్పులు చేయాలన్న కాంగ్రెస్ ప్రచారాన్ని సమర్థిస్తున్నానని ఆయన తెలిపారు. వేర్వేరు వ్యాక్సిన్ల ధరలను నిర్ణయించడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. ఈ విధానం వల్ల టీకామందుల ధరల మధ్య ఎంతో వ్యత్యాసం ఏర్పడుతోందని, నూతన లిబరలైజ్డ్ పాలసీలో చాలా లోపాలు ఉన్నాయని శశిథరూర్ విమర్శించారు. వీటిని మార్చాలని ఆయన అభిప్రాయపడ్డారు. భారతీయులందరికీ యూనివర్శల్ వ్యాక్సినేషన్ అందజేసేలా ప్రభుత్వ విధానంలో భారీ మార్పులు చేయాలంటూ భారత జాతీయ కాంగ్రెస్ చేపట్టిన విస్తృత ప్రచారానికి తాను మద్దతిస్తున్నానని, డిసెంబర్‌లోగా దేశంలోని ప్రతి ఒక్కరికీ ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలని శశిథరూర్ మరోసారి కేంద్రాన్ని డిమాండ్ చేశారు.