Begin typing your search above and press return to search.
మర్రిశశిధర్ కు షాకిచ్చిన కొడుకు
By: Tupaki Desk | 26 Aug 2018 11:12 AM GMTమాజీ మంత్రి - కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కుమారుడు ఆదిత్య రెడ్డి ఊహించని షాక్ ఇచ్చాడు. మొన్నీ మధ్యే పురుడుపోసుకున్న కోదండరాం పార్టీ ‘తెలంగాణ జనసమితి’ పార్టీలో చేరారు. ఈ ఉదయం టీజేఏసీ చైర్మన్, పార్టీ అధినేత కోదండరాం సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ జనసమితి పార్టీ టిక్కెట్ పై పోటీచేసేందుకు నిర్ణయించుకున్నారు.
ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా చేసిన మర్రిచెన్నారెడ్డికి శశిధర్ రెడ్డి కుమారుడు. శశిధర్ రెడ్డి సనత్ నగర్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1992 ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఇదే నియోజకవర్గం నుంచి 1994 - 2004 - 2009 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. గడిచిన 2014 ఎన్నికల్లో మాత్రం టీడీపీ నుంచి పోటీచేసిన తలసాని శ్రీనివాస యాదవ్ చేతిలో ఓడిపోయారు. తలసాని టీఆర్ఎస్ లో చేరడంతో ఆ నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగారు.
కాగా శశిధర్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ లోనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో హస్తం పార్టీ నుంచే సనత్ నగర్ నుంచి పోటీచేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన కుమారుడు ఆదిత్య మాత్రం ఆశ్చర్యకరంగా తండ్రితో విభేదించి తెలంగాణ జనసమితిలో చేరడం విశేషం. ఈయన సనత్ నగర్ నుంచి పోటీచేస్తాడా లేక వేరే నియోజకవర్గమా అన్నది తెలియాల్సి ఉంది.