Begin typing your search above and press return to search.

శశికళ 23 గంటల ప్రయాణ ఖర్చు జస్ట్ 200 కోట్లు అట?

By:  Tupaki Desk   |   13 Feb 2021 3:30 AM GMT
శశికళ 23 గంటల ప్రయాణ ఖర్చు జస్ట్ 200 కోట్లు అట?
X
తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు జైల్లో ఉన్నా.. బయట ఉన్నా క్రేజ్ తగ్గలేదని నిరూపించుకుంటున్నారు. అక్రమాస్తుల కేసులో జైలు పాలై తాజాగా విడుదలైన శశికళ రాజభోగాలతో తమిళనాడుకు తరలిరావడం విశేషం. ఆమె బెంగళూరు నుంచి ఇటీవలే తన స్వస్థలం చెన్నైకి వచ్చారు.

చిన్నమ్మ శశికళకు చెన్నైలో ఘన స్వాగతం లభించింది. ఆమె అనుచరులు నీరాజనాలు పలికారు. శశికళ బెంగళూరు టు చెన్నైకి రావడానికి ఆమె అనుచులు పెట్టిన ప్రయాణ ఖర్చు అక్షరాల రూ.200 కోట్లు అట.. ఈ విషయం తెలిసి దేశవ్యాప్తంగా అందరూ ముక్కున వేలేసుకున్నారు.

దాదాపు వంద కార్లలో శశికళ అనుచరులు భారీ ర్యాలీ నిర్వహించారు. పూర్ణ కుంభ స్వాగతాలు, అడుగడుగునా పూలను వెదజల్లుతూ చిన్నమ్మను తమిళనాడుకు తీసుకెళ్లారు. హెలికాఫ్టర్‌ నుంచి పూల వర్షం కురిపించాలని భావించినప్పటికీ కుదరలేదు. ఆ ఒక్కటి మినహా చిన్నమ్మకు బెంగళూరు నుంచి చెన్నై వరకూ ఐదు గంటలు సాగాల్సిన ప్రయాణం 23 గంటలు పట్టిందంటే ఏ రేంజ్‌లో స్వాగతం పలికారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గంటకు ఏకంగా 8 కోట్లకు పైగా ఆమె అనుచరులు ఖర్చు పెట్టడం విశేషం.

ఆమె అనుచరులు శశికళ 23 గంటల ప్రయాణానికి 200 కోట్లు ఖర్చు పెట్టడం చూస్తుంటే ఇక రాబోయే తమిళనాడు ఎన్నికల్లో ఇంకా ఎంత ఖర్చు పెడుతారో అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

తమిళనాడుకు శశికళ రాక.. గ్రాండ్ ఎంట్రీ ప్రకంపనలు సృష్టించింది. నాలుగేళ్లుగా బెంగళూరు జైల్లో ఉన్న ఆమె సొంత గడ్డపై వచ్చీరాగానే రాజకీయాలను షేక్ చేస్తున్నారు. ఇంత భారీ ఎంట్రీతోనే ఆమె తన ఉనికిని బలంగా చాటిచెప్పారు. రాబోయే తమిళనాడు ఎన్నికల్లో శశికళ నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది.