Begin typing your search above and press return to search.

శ‌శిక‌ళ కీలక నిర్ణ‌యం ... వచ్చేస్తోన్నా అంటూ ప్రకటన !

By:  Tupaki Desk   |   11 Oct 2021 5:23 AM GMT
శ‌శిక‌ళ కీలక నిర్ణ‌యం ... వచ్చేస్తోన్నా అంటూ ప్రకటన !
X
అన్నాడిఎంకే బహిష్కృత నేత శశికళ మళ్లీ ప్ర‌త్య‌క్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ద‌మైంద‌ని తెలుస్తోంది. ఇటీవ‌లే జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకే ఓట‌మి పాలైంది. ఈ నేప‌థ్యంలో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు శశికళ ప్రకటించారు. అన్నాడీఎంకే అధినేత, మాజీ సీఎం జ‌య‌ల‌లిత‌ మరణం తర్వాత పార్టీ తీవ్ర ఒడిదొడుకులకు గురైన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అన్నాడిఎంకే పార్టీ జనరల్‌ సెక్రటరీగా శశికళ నియమితులయ్యారు.

అయితే, 2017లో అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో ఆమె జైలుకు వెళ్లారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2017 సెప్టెంబర్‌లో శశికళతో పాటు ఆమె అల్లుడు దినకరన్‌ను ఏఐఏడీఎంకే పార్టీ నుంచి తొలగించింది. జైలు నుంచి విడుదలైన శశికశ కూడా రాజకీయాలకు దూరంగా ఉంటార‌ని ప్ర‌క‌టించారు. చివరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఓటమి పాలయ్యింది. ఇదే అదునుగా భావించిన శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమౌతున్నారనే ప్రచారం మొదలయ్యింది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ నేనొస్తున్నా అంటూ కేడర్‌ను ఉద్దేశించి ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. అన్నాడీఎంకే అందరిదీ అని, ఇందులో అందరూ సమానమే అని వ్యాఖ్యానించారు. పార్టీకి నేతృత్వం వహించే వారు తల్లితో సమానం అని, కేడర్‌ను బిడ్డల వలే చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం అన్నాడీఎంకే నాయకత్వ సంక్షోభంలోఉంది. పళని స్వామి, పన్నీర్ సెల్వం ఆధిపత్య పోరాటంతో క్యాడర్‌ కు వారిపై నమ్మకం కలగడం లేదు. కొద్ది రోజుల కిందట పన్నీర్ సెల్వం, పళనీ స్వామి మోడీ, అమిత్ షాలతోసమావేశం అయ్యారు. ఆ సందర్భంగా అన్నాడీఎంకేలోకి శశికళను తీసుకుని కీలక బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ఆమె వస్తే తమ పరిస్థితి డమ్మీ అవుతుందని ఈపీఎస్, ఓపీఎస్ ఇద్దరూ అంగీకరించడం లేదు. శశికళ ప్రస్తుతం అన్నాడీఎంకేను స్వాధీనం చేసుకునేందుకు పావులు కదపుతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ శశికళ పార్టీలోకి మళ్లీరాకుండా చేయాలని ఇద్దరు నేతలు పట్టుదలగా ఉన్నారు.

సీఎం స్టాలిన్‌ ను ఢీకొట్టే నేత లేకపోతే, అన్నాడీఎంకే మనుగడ కష్టం అన్న విశ్లేషణలు వస్తూండటం, పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఇద్దరూ ఎవరికి వారే అన్నట్లుగా పోటీ పడుతున్నారు. దీంతో క్యాడర్‌ కూడా రెండుగా విడిపోయింది. ఈ సమయంలో అన్నాడీఎంకే విషయంలో మళ్లీ శశికళ తెర ముందుకు వస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీకి తాను తప్ప, ఎవరూ పెద్ద దిక్కు లేరని తెర ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ కూడా ఆమెకు మద్దతుగా ఉంటోంది. శశికళ అన్నాడీఎంకేలోకి వస్తే ఆమె వర్గానికి చెందిన ఐదు శాతం ఓటు బ్యాంక్ కలసి వస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికలు , వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని నచ్చ చెబుతున్నారు. దానికి తగ్గట్లుగానే శశికళ గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారు. ఒకటి, రెండు నెలల్లో శశికళ చేతుల్లోకి అన్నాడీఎంకే వెళ్లొచ్చని పలువురు భావిస్తున్నారు.