Begin typing your search above and press return to search.

అమిత్ షాకు రాయబారం పంపిన శశికళ?

By:  Tupaki Desk   |   20 Feb 2021 10:00 PM IST
అమిత్ షాకు రాయబారం పంపిన శశికళ?
X
జయలలిత స్నేహితురాలు , ఇటీవలే జైలు నుంచి విడుదలైన శశికళ కేంద్రంలోని బీజేపీకి బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు సమాచారం. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవితోపాటు, అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లు తమ వారికి ఇస్తే తమ పార్టీని అన్నాడీఎంకేలో విలీనం చేస్తామని.. ఇందుకు సహకరించాలని శశికళ తాజాగా కేంద్రహోంమంత్రి అమిత్ షాకు రాయబారం పంపినట్లు సమాచారం.

శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ఈ మేరకు ఇద్దరు పారిశ్రామికవేత్తల ద్వారా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు, సీఎం ఫళనిస్వామి వద్దకు ఈ సందేశం పంపినట్లు సమాచారం.

అయితే ఈ రాయబారాన్ని తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే అధ్యక్షుడు ఫళనిస్వామి తిరస్కరించినట్లు సమాచారం. అమిత్ షా మాత్రం ఈ పరిణామంపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఏం చేయాలనే దానిపై ప్రస్తుతం శశికళ ఆలోచిస్తున్నట్టు తమిళనాట ప్రచారం సాగుతోంది.

శశికళ రాకతో అధికార అన్నాడీఎంకే చీలడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆమె వెంట వెళుతారనే ప్రచారం సాగుతోంది. ఈనెల 24న జయలలిత జయంతి సందర్భంగా అన్నాడీఎంకే నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు బయటకు వస్తారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్ణయం ఇక్కడ కీలకంగా మారనుంది. ఆయన ఒప్పుకుంటే జయలలిత పార్టీలో ఉంటారు. లేదంటే అన్నాడీఎంకే చీలడం ఖాయంగా కనిపిస్తోంది.