Begin typing your search above and press return to search.

దీదీకి సిన్హా 'శత్రు' ఘ్నమేనా...!?

By:  Tupaki Desk   |   19 Jan 2019 4:56 PM GMT
దీదీకి సిన్హా శత్రు ఘ్నమేనా...!?
X
భారీ ర్యాలీకి 24 గంటలు గడవలేదు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఏర్పడిన కూటమికి ఒక రోజు వయసు కూడా రాలేదు. దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు పదిహేను ప్రాంతీయ పార్టీలు, ఒకటి రెండు జాతీయ పార్టీలు కలిపి కూటమిగా ఏర్పాడి కొన్ని గంటలైనా కాలేదు. ఇంతలోనే ఆ పార్టీల మధ్య పొరపొచాలు బయట పడ్డాయి. అభిప్రాయ బేధాలు వెలుగు చూస్తున్నాయి. ఇదంతా ఎవరి గూర్చి అనుకుంటున్నారా... ఎవరెవరి మధ్య విబేధాలు వచ్చాయి అనుకుంటున్నారా.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని... ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీని అధికారంలోంచి తప్పించేందుకు ఏకమైన కూటమిలో లుకలుకలే. బిజేపీకి వ్యతిరేకంగా త్రుణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా అఖిలేష్‌ యాదవ్ - శరద్‌ పవార్ - కేజ్రీవాల్ - బిజేపీని నుంచి బయటకి వచ్చిన నాయకులు అరుణ్ శైరి - శత్రుఘ్నసిన్హా వంటి వారు హాజరయ్యారు. ఈ భారీ కలయిక కేంద్రంలో బిజేపీని తప్పక ఓడిస్తుందని సభ వేదిక నుంచి ప్రకటించారు. అయితే వీరంతా కలవడం వరకూ బాగానే ఉంది. వీరి నాయకుడు ఎవరన్న దాని పైనే అప్పుడే వివాదం ప్రారంభమయ్యింది.

కోల్‌కతా ర్యాలీకి ప్రాతినిథ్యం వహించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తమ ప్రధాని అభ్యర్దిగా అంగీకరించలేమంటూ ప్రముఖ నటుడు - బిజేపీ మాజీ నాయకుడు శత్రుఘ్నసిన్హా ప్రకటించారు. మమతా బెనర్జీ జాతీయ నాయకురాలని - పరిపాలన విషయంలో మాత్రం ఆమె చెప్పె దానికి - చేసే దానికి పొంతన ఉండదని శత్రుఘ్నసిన్హా వ్యాఖ్యనించారు. మమతా బెనర్జీ ద్వంద ప్రమాణాలు పాటించే నాయకురాలిగా శత్రుఘ్నసిన్హ అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు - ప్రకటనలు ప్రతిపక్ష పార్టీల మధ్య నెలకొన్న వైరుధ్యాలను తెలియజేస్తున్నాయని రాజకీయ పండితులు అంటున్నారు. ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా ప్రతిపక్ష కూటమికి తొలిరోజునే శత్రుఘ్నసిన్హా రూపంలో ఎదురు దెబ్బ తగలడంలో ఆ పార్టీల మనుగడకు ప్రశ్నార్ధకమని వారు అంటున్నారు. మాయవతి - కె. చంద్రశేఖర రావు - వైఎస్ జగన్ మోహన రెడ్డి కీలక నాయకుల మద్దతు లేకుండా ప్రతిపక్షాల కూటమి ఎలా మనుగడ సాగిస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు.