Begin typing your search above and press return to search.

ఎఫైర్స్ గురించి ఓపెన్ అయిన షాట్ గన్

By:  Tupaki Desk   |   19 Jan 2016 6:29 AM GMT
ఎఫైర్స్ గురించి ఓపెన్ అయిన షాట్ గన్
X
ఈ మధ్య కాలంలో రాజకీయంగా ప్రధాన శీర్షికల్లో తరచూ కనిపిస్తున్న బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చారు. కాకుంటే ఈసారి ఆయన రాజకీయంతో కాకుండా తన వ్యక్తిగత అంశాల్ని ప్రకటించి వార్తల్లోకి ఎక్కారు. షాట్ గన్ గా సుప్రసిద్ధుడైన శత్రుఘ్నసిన్హా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు.

రాంగోపాల్ వర్మ తీసిన రక్తచరిత్ర చిత్రంలో ఎన్టీఆర్ పోలిన పాత్రను నటించి మెప్పించిన ఆయన తాజాగా తన ఆత్మకథను రిలీజ్ చేశారు. దాదాపు ఏడేళ్ల ప్రయత్నం తర్వాత రచయిత్రి భారతి ఎస్ ప్రధాన్ పూర్తి చేసిన పుస్తకం పేరు.. ‘‘ఎనీ థింగ్ బట్ ఖామూష్’’. ఈ పుస్తకంలో తన ఆత్మకథను చెప్పుకునే క్రమంలో చాలా విషయాల్ని ఓపెన్ గానే ప్రస్తావించటం విశేషం.

తన జీవితంలోకి ప్రవేశించిన పలువురు మహిళల గురించి.. వారితో తనకున్న అనుబంధం గురించి.. తన ప్రియురాళ్లు.. తన అక్రమ సంబందాలు ఇలా అన్ని విషయాల్ని ఓపెన్ గానే ప్రస్తావించేశాడట. పలువురు రాజకీయ నేతలతో కలిసి ఢిల్లీలో ఈ పుస్తకాన్ని రిలీజ్ చేసిన శత్రుఘ్న సిన్హా.. తన ఎఫైర్స్ కు సంబంధించి కొందరి పేర్లు మాత్రమే బయటపెట్టారు.

అలాంటి వారిలో రీనారాయ్ తో అనుబంధం.. పూనంను పెళ్లి చేసుకోవటం లాంటి వాటిని ఓపెన్ గానే ప్రస్తావించినా.. పలు ఆక్రమ సంబంధాల గురించి మాత్రం పెదవి విప్పేందుకు పెద్దగా ఇష్టపడలేదు. వారికి సంబంధించిన వివరాలు ఉన్నా పేర్లు మాత్రం ప్రస్తావించలేదు. ఎందుకంటే.. వారంతా ఇప్పుడు మెగుడు పిల్లలతో సుఖంగా ఉన్నారని.. అలాంటప్పుడు వారిని ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశ్యంతోనే తాను పేర్లు బయటపెట్టలేదని సెలవిస్తున్నాడు.