Begin typing your search above and press return to search.
మోడీ మంత్రులంతా భజన బృందం అంటున్న బీజేపీ ఎంపీ
By: Tupaki Desk | 25 Nov 2017 8:14 AM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే ఇంతెత్తున ఎగిరిపడే బీజేపీ ఎంపి శతృఘ్న సిన్హా మరోమారు కలకలం రేకెత్తించే కామెంట్లు చేశారు. గతంలో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ సహా మోడీ తీసుకున్న ఇతరత్రా నిర్ణయాలను తీవ్రంగా తప్పుపట్టిన సిన్హా ఈ దఫా ఏకంగా కేంద్ర కేబినెట్‌పైనే విరుచుకుపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రులపై ఆ పార్టీ ఎంపీ శతృఘ్నసిన్హా తీవ్ర విమర్శలు చేశారు. మోడీ ప్రభుత్వ మంత్రివర్గాన్ని భజన బృందంగా అభివర్ణించారు. 90 శాతం మంది మంత్రులు ప్రజలకు తెలియదని, వారు నిర్మాణాత్మక, సృజనాత్మకమైన పనులు చేయడం లేదన్నారు. వారు కేవలం తమ పదవులను కాపాడుకునే పనిలో తీరికలేకుండా ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏక వ్యక్తి కేంద్రంగా, పార్టీ ఇద్దరు వ్యక్తుల ప్రదర్శనగా మారిపోయాయని ఆయన విమర్శించారు
జేడీయూ రెబల్ ఎంపీ అలీ అన్వర్ రాసిన పుస్తకం విడుదల కార్యక్రమంలో సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరీ, జేడీయూ చీలికనేత, ఎంపీ శరద్‌యాదవ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిన్హా మాట్లాడుతూ ప్రజలు తప్పనిసరిగా ఒక వ్యక్తికి మద్దతు ప్రకటించాల్సిన పరిస్థితులను సృష్టించారని, లేకపోతే దేశద్రోహులుగా ముద్రవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మేధావులను హత్య చేశారని, తాజాగా న్యాయమూర్తులను కూడా హత్య చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రివర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, అందులో 90శాతం మంది ప్రజలకు తెలియనే తెలియదని సిన్హా ఎద్దేవా చేశారు.`కేంద్ర మంత్రులు ప్రజలకు ఏదో చేసేయాలని అనుకోరు, వారి ఉపాధి పోకుండా కాపాడుకోవడంలో బిజీగా ఉంటారు.` అని ఎద్దేవా చేశారు. ఒక లాయర్ ఆర్థిక మంత్రి అవగా, ఒక టీవీ నటి మానవ వనరుల అభివృద్ధి మంత్రి కాగా జీఎస్‌టీపై తానెందుకు మాట్లాడరాదని సిన్హా సూటిగా ప్రశ్నించారు. దేశంలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో కొద్దికాలం కిందటి వరకు మేదావులు హత్యకు గురవుతుండగా, ఇప్పుడు న్యాయమూర్తులు కూడా హత్య చేయబడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాలకు మీడియాలో తగిన స్థానం దక్కడం లేదన్నారు. ప్రజాధికారానికన్నా ధనాధికారానికే మంచి స్థానం లభిస్తోందని సిన్హా ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ పాలన బాలివుడ్ దర్శక, నిర్మాత మన్మోహన్ దేశాయ్ చిత్రాలను తలపిస్తున్నదని పేర్కొన్నారు. మన్మోహన్ దేశాయ్ తన సినిమాలు చూస్తున్న ప్రేక్షకులకు ఆలోచించే అవకాశం కల్పించేవారు కాదని, అలాగే మోడీ ప్రభుత్వం సైతం రోజుకో నినాదం ఇస్తూ.. తమ చుట్టూ ఏమి జరుగుతుందో ఆలోచించే అవకాశం ప్రజలకు లేకుండా చేస్తున్నదని ఏచూరి ఎద్దేవా చేశారు. అనంతరం శరద్‌యాదవ్ మాట్లాడుతూ 1975లో కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీని ప్రస్తుత పరిస్థితులు తలపిస్తున్నాయని, అయితే అప్పటి ఎమర్జెన్సీ కనిపించిందని, ఇప్పుడు కనిపించడం లేదన్నారు.