Begin typing your search above and press return to search.
ఆ ఎంపీ మోడీకి ఇంటిపోరు రుచి చూపించాడు
By: Tupaki Desk | 4 Jan 2019 3:00 PM GMTపార్టీలో సర్వం తానే అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇంటిపోరు అంటే ఎలా ఉంటుందో...ఓ రేంజ్ లో తెలిసివస్తున్నట్లుంది. బీజేపీలో ఎదురులేని నేతగా ఎదిగి...పార్టీ సీనియర్లను సైతం విజయవంతంగా పక్కకు పెట్టిన్పటికీ ఆయనకు అసంతృప్త నేతలతో చుక్కలు కనిపిస్తున్నాయని అంటున్నారు. పక్కలో బల్లెంలాగా మారిన బీజేపీ పార్టీ నాయకుడు శత్రుఘ్న సిన్హా మరోమారు మోడీపై విమర్శలు గుప్పించారు. ఏఎన్ ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మోడీ తన భావాలు పంచుకుంటే...దానిపై సిన్హా సెటైర్లు వేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ పత్రికా సమావేశాలంటే నచ్చదని జాతీయ స్థాయి జర్నలిస్టుల్లో ఓ భావన ఉంది. గత నాలుగున్నరేళ్లలో ప్రధానిగా ఆయన ఒక్కటంటే ఒక్కటి పత్రికా సమావేశం నిర్వహించకపోవడం దీనికి నిదర్శనం. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం సందర్భంగా ఏఎన్ ఐ విలేకరి స్మితా ప్రకాశ్ కు మోడీ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వడంపై పేరుకే బీజేపీ ఎంపీ అయినప్పటికీ మోడీ చర్యలన్నింటిని టార్గెట్ చేసే సిన్హా ఘాటు కామెంట్లు చేశారు. ``బోలెడు పరిశోధనతో - ఏర్పాట్లతో - పూర్వరంగం సిద్ధం చేసుకుని మరీ....ఏదో ఓ విలేకరికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు సరే.. హేమాహేమీల వంటి జర్నలిస్టులు పాల్గొనే బహిరంగ ఇంటర్వ్యూ ఎప్పుడు?`అంటూ సిన్హా ప్రశ్నించారు. ``దేశ ప్రధానులు తరచుగా పత్రికా సమావేశాలు నిర్వహించి మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అదే తరహాలో మీరెందుకు మీడియా ముందుకు రారు?సర్కారీ జర్నలిస్టులు పాడే రాగ్ దర్బారీలు ఎందుకు? `` అంటూ తనదైన శైలిలో ప్రశ్నల వర్షం గుప్పించారు.
ఎన్డీఏకు పలు పార్టీలు గుడ్ బై చెప్పడాన్ని ప్రస్తావిస్తూ ``సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ (అందరి ప్రగతి) అనేది మీ నినాదం కదా? మరి అందరూ ఎందుకు వెళ్లిపోతున్నారు? మిత్రుడు - సహచరుడు - సోదరుడుగా నేనిచ్చే సలహా గురించి ఆలోచించండి.. కాదంటే ఎన్నికలు ఎటూ దగ్గర పడుతున్నాయి.. మనకికి దేవుడే దిక్కు సారూ.. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.. నూతన సంవత్సరం సందర్భంగా అంతా ధైర్యంగా - నిజాయితీగా - ఖుల్లంఖుల్లంగా మాట్లాడుకుందాం.. నాటకీయతలు లేకుండా..`` అంటూ హితబోధ కూడా చేసేశారు. కాగా, సిన్హా తన సెటైర్ల ట్వీట్ లకు ప్రధాని విలేకరి స్మితా ప్రకాశ్ ను ట్యాగ్ చేయగా...ఆమె ఘాటుగా బదులిచ్చారు. ``సందేశం మోడీకే అయితే ఆయననే ట్యాగ్ చేయండి. నాలాంటి చిన్న జర్నలిస్టులను ఎందుకు ట్యాగ్ చేస్తున్నారు?మీరు షాట్ గన్ సిన్హా.. సాంబా కాదు.. `` అని సిన్హాపై చురకలు వేశారు.