Begin typing your search above and press return to search.

వామ్మో.. హీరోగారి భార్య ఆస్తులు ఆ రేంజ్ లోనా!

By:  Tupaki Desk   |   30 April 2019 2:30 PM GMT
వామ్మో.. హీరోగారి భార్య ఆస్తులు ఆ రేంజ్ లోనా!
X
లక్నో నుంచి భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్ - కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మీద పోటీకి దిగిన సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి పూనమ్ సిన్హా ఆస్తులు ఆశ్చర్యానికి గురి చేసే స్థాయిలో ఉన్నాయి. బాలీవుడ్ అలనాటి స్టార్ హీరో శత్రుఘ్నసిన్హా భార్య అయిన పూనమ్ సిన్హా రికార్డు స్థాయిలో ఆస్తుల డిక్లరేషన్ చేశారు. మరో విశేషం ఏమిటంటే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరిగే ఐదో దశ పోలింగ్ లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో కెళ్లా రిచ్ పొలిటిషియన్ పూనమ్ సిన్హా కావడం విశేషం.

ఆమె ఆస్తుల విలువ అక్షరాలా నూటా తొంబై మూడు కోట్ల రూపాయలట! ఈ ఆస్తులతో ఆమె ఐదో విడత పోలింగ్ లో పోటీలో ఉన్న అభ్యర్థులందరి కన్నా అత్యంత సంపన్నురాలిగా నిలుస్తూ ఉంది.

భర్త స్టార్ హీరో కావడంతోనే ఆమె ఈ స్థాయిలో ఆస్తులు కూడబెట్టారో లేక వ్యాపార వేత్తగా రాణించి ఇంత ధనికురాలు అయ్యారో కానీ.. ఈ రేంజ్ లో ఆస్తులను డిక్లేర్డ్ చేసి మాత్రం ఆమె వార్తల్లోకి వస్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల వేళ శత్రుఘ్న ఫ్యామిలీ అంతా రకరకాల రీజన్లతో వార్తల్లో నిలుస్తూ ఉంది.

ముందుగా షాట్ గన్ పార్టీ మారారు. ఆయన పార్టీ మారడంపై కూతురు సోనాక్షి కూడా పొలిటికల్ కామెంట్లు చేసింది. తన తండ్రిని బీజేపీ అవమానపరిచిందని ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత పూనమ్ సిన్హా సమాజ్ వాదీ పార్టీలో చేరారు. భార్య, భర్త చెరో పార్టీ తరఫున పోటీ చేసి ఆసక్తిని రేపారు.ఇక హాట్ పొలిటికల్ కామెంట్లను చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు పూనమ్ సిన్హా భారీ స్థాయి ఆస్తులతో తెర మీదకు వచ్చారు!