Begin typing your search above and press return to search.

ఆమెకు 56 ఏళ్లు.. మనమరాలికి జన్మనిచ్చింది

By:  Tupaki Desk   |   7 Nov 2022 4:17 AM GMT
ఆమెకు 56 ఏళ్లు.. మనమరాలికి జన్మనిచ్చింది
X
అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ పుణ్యమా అని.. ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆ కోవలోకే వస్తుంది ఇప్పుడు చెప్పే ఉదంతం. 56 ఏళ్ల వయసులో ఒక మహిళ తన మనమరాలికి జన్మనిచ్చిన వైనం ఇప్పుడు ఆసక్తితో పాటు..అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.సరగోసి గురించి తెలిసిందేగా. పిల్లల్ని కనే అవకాశం అందరికి ఉండదు. కొందరికి ఆరోగ్య సమస్యలతో పాటు.. ఇతర ఇబ్బందుల కారణంగా పిల్లలకు జన్మనిచ్చే అవకాశాన్ని కోల్పోతుంటారు. ఇలాంటి వారు తమ వారసుల కోసం తపిస్తుంటారు.

అలాంటి వారికోసమే ఉన్న సరగోసి విషయానికి వస్తే.. వేరే వారి అద్దె గర్భంలో కంటే.. తన కొడుకు..కోడలి బిడ్డకు సరగోసి పద్దతిలో తానే తల్లిగా మారేందుకు 56 ఏళ్ల అమెరికన్ మహిళ ముందుకు వచ్చారు. తాజాగా ఆమెకు డెలివరీ విజయవంతంగా కావటమే కాదు.. నానమ్మ కాస్తా అమ్మగా మారి జన్మను ఇచ్చింది.

అమెరికాలోని ఉతాహ్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో.. సదరు మహిల కోడలికి గర్భాశయాన్ని తొలగించారు. దీంతో.. పిల్లల్ని కనే అవకాశం ఆమెకు లేదు.

దీంతో.. తన కొడుకు.. కోడలి బిడ్డకు తాను తల్లిగా వ్యవహరిస్తానని ఒప్పుకున్నట్లు చెప్పారు. జెఫ్ హాక్ అనే వ్యక్తి కాంబ్రియా అనే మహిళను పెళ్లాడారు. ఆమె గర్భాశయాన్ని తొలగించారు. దీంతో.. సరగోసి పద్దతిలో వారి బిడ్డకు తాను బిడ్డను కని ఇచ్చేందుకు ఓకే చెప్పింది 56 ఏళ్ల నాన్సీ హాక్.

అయితే.. ఇది సాధ్యం కాదని ఆమె భర్త భావించారు. ఇందులో భాగంగా వైద్యులకు చూపిస్తే.. అందుకు ఆమె గర్భం అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. దీంతో.. సరగోసి పద్దతిలో ఆమెలో పిండాన్ని పెంచారు.

తన తల్లి తన బిడ్డకు జన్మనివ్వటాన్ని చూసిన కొడుకు భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లి గుర్తుగా పుట్టిన పాపకు హన్నా అన్న పేరు పెట్టారు. డెలివరీకి ముందు.. ఎలాంటి నిర్దారణ పరీక్షలకు ముందే తన కడుపులో పెరుగుతున్న కొడుకు.. కోడలి బిడ్డ ఆడపిల్ల అని తన తల్లి చెప్పటం.. చివరకు అదే నిజం కావటం వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. 56 ఏళ్ల వయసులో ఒక మహిళ తన మనమరాలికి జన్మనివ్వటం చాలా అరుదైన అంశంగా చెబుతున్నారు. నిజంగానే ఇది చాలా అరుదైన సంఘటనగా చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.