Begin typing your search above and press return to search.

జర్మనీ దేశ చరిత్రలో అలాంటి నేరం చేసిన మహిళ ఆమెనేనట

By:  Tupaki Desk   |   6 May 2022 8:46 AM GMT
జర్మనీ దేశ చరిత్రలో అలాంటి నేరం చేసిన  మహిళ ఆమెనేనట
X
ఆన్ లైన్ లో పరిచయమైన ఆ జంట ఎంచక్కా తామిద్దరూ కోరుకుంటున్నట్లుగా బతికేస్తున్నారు. సెక్సువల్ జీవితాన్ని అస్వాదిస్తున్నారు. అనుకోని రీతిలో సదరు మహిళ ఆలోచనలో వచ్చిన మార్పు తాజాగా ఆమెను జైలుకు వెళ్లేలా చేసింది. అంతేనా.. జర్మనీ దేశ చరిత్రలో ఆ తరహా నేరం కింద కేసు కట్టి.. శిక్ష పడిన తొలి దోషిగా ఆమె నిలిచింది. పశ్చిమ జర్మనీలోని బీల్ఫెల్డ్లో జరిగిన ఈ ఉదంతం సంచలనంగా మారింది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

జర్మనీకి చెందిన ఒక జంట ఏడాది క్రితం ఆన్ లైన్ లో పరిచమయ్యారు.అతడికి 42 ఏళ్లు. ఆమెకు 39 ఏళ్లు. తక్కువ వ్యవధిలోనే వారి స్నేహం కాస్తా రిలేషన్ షిప్ లోకి మారిపోయింది. ఇరువురు శారీరక సంబంధాన్ని పెట్టుకున్నారు. అలా లైఫ్ ను తమకు నచ్చినట్లుగా జీవిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే సదరు మహిళకు తన ప్రియుడి మీద మనసైంది. తనతో రిలేషన్ లో ఉన్నప్పటికీ.. అతడు పెళ్లి చేసుకోడన్న ఆలోచనతో కొత్త తరహాగా ఆలోచించింది.

రిలేషన్ షిప్ ప్రారంభించినప్పుడు పెళ్లి వరకు వారి ఆలోచనలు లేవు. కానీ.. అతడితో రిలేషన్ షిప్ సాగిస్తున్న కొద్దీ అతడ్ని తన భర్తను చేసుకోవాలన్న ఆశ పుట్టింది. అదేమీ తప్పు కూడా కాదు. కానీ.. ఆ విషయాన్ని అతడ్నే నేరుగా అడిగేసి.. తేల్చేసుకుంటే బాగుండేది. అందుకు భిన్నంగా అతడ్ని మోసపూరితంగా పెళ్లి చేసుకునేలా చేసింది. ఇందులో భాగంగా అతడితో సెక్సు చేస్తున్న సమయంలో.. ప్రియుడికి తెలీకుండా అతడి కండోమ్ కు చిల్లు పెట్టేసింది.

దీంతో.. ఆమె కాస్తా ప్రెగ్నెంట్ అయ్యింది. అయితే.. తాను ప్రెగ్నెంట్ అయ్యానన్న విషయాన్ని చెప్పాల్సిన విధంగా చెప్పకుండా.. తాను చేసిన తప్పును చెప్పేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె ప్రియుడు కోర్టును ఆశ్రయించాడు. తనను మోసం చేసిన వైనాన్ని చెప్పి.. న్యాయం కావాలని కోర్టును కోరాడు. అతడి వాదనను విన్న కోర్టు.. సదరు మహిళపై ‘’ నేరం కింద ఆమెను అరెస్టు చేశారు.

ఇంతకీ.. స్టెల్తింగ్ అంటే ఏమిటి? ఆ నేరారోపణ తీవ్రత ఎంతన్న విషయానికి వస్తే.. లైంగికంగా ఇద్దరు కలిసినప్పుడు.. పురుషుడు తన కండోమ్ ను రహస్యంగా తీసి వేస్తే దానిని స్టెల్తింగ్ గా పరిగణిస్తారు. భాగస్వామికి తెలీకుండా.. వారికి ముందే చెప్పకుండా కండోమ్ తీసేయటాన్ని నేరంగా పరిగణిస్తారు. ఇప్పటివరకు ఇలాంటి నేరాలు పురుషుల మీద మాత్రమే నమోదయ్యాయి.

జర్మనీ చరిత్రలో తొలిసారి ఈ నేరం కింద.. ఒక మహిళ మీద కేసు నమోదు చేయటం.. ఆమెకు ఆర్నెల్లు శిక్ష పడటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఈ కేసు చరిత్రలో నిలిచిపోతుందన్న మాట వినిపిస్తోంది.