Begin typing your search above and press return to search.

దేశంలోనే అత్యంత సంపన్న మహిళ ఆమె.. ఆస్తి ఎంతంటే?

By:  Tupaki Desk   |   28 July 2022 4:38 AM GMT
దేశంలోనే అత్యంత సంపన్న మహిళ ఆమె.. ఆస్తి ఎంతంటే?
X
దేశంలోనే అత్యంత ధనిక మహిళ ఎవరు? అన్న ప్రశ్నకు తాజాగా సమాధానం వచ్చేసింది. అంతేకాదు.. దేశంలో సంపన్న టాప్ 100 మహిళల జాబితాను తీస్తే.. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన సంపన్న మహిళామణుల జాబితా పెద్దదిగా ఉండటం ఆసక్తికరంగా మారింది.

ఇంతకీ దేశంలోనే అత్యంత సంపన్న మహిళ మరెవరో కాదు.. ప్రఖ్యాత టెక్ కంపెనీ హెచ్ సీఎల్ టెక్నాలజీస్ కు ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న రోష్ని నాడార్ మల్హోత్రానే. 2021లో ఆమె నికర సంపద 54 శాతం పెరిగి రూ.84,330 కోట్లకు చేరినట్లుగా తాజాగా విడుదలైన కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్ - హురున్ జాబితా వెల్లడించింది.

తర్వాతి స్థానాన్ని ఇన్వెస్టు బ్యాంకింగ్ ప్రొఫెషన్ ను వదులుకొని సొంతంగా ఎదిగిన 59 ఏళ్ల ఫల్గుణి నాయర్ అగ్ర స్థానంలో నిలిచారు. ఆమె సంపద 963 శాతం పెరిగి రూ.57,520 కోట్లకు చేరుకుంది. బయోకాన్ కిరణ్ మజుందార్ షా నికర సంపద మాత్రం భారీగా తగ్గింది.

దీంతో ఆమె సంపద రూ.29,030 కోట్లకు చేరి మూడో స్థానంలో నిలిస్తే.. నాలుగో స్థానంలో తెలుగు ప్రాంతానికి చెందిన దివీస్ ల్యాబ్స్ కు చెందిన నీలిమ నిలిచారు. భారత్ లో పుట్టి లేదంటే పెరిగిన 100 మంది సంపన్న మహిళల జాబితాను సిద్ధం చేశారు. వీరి మొత్తం సంపద 2020లో రూ.2.72 లక్షల కోట్లు ఉంటే.. ఏడాదిలో అది కాస్తా రూ.4.16 లక్షల కోట్లుకు చేరటం గమనార్హం. ఇది భారత జీడీపీలో 2 శాతానికి సమానమని చెబుతున్నారు.

టాప్ 100 జాబితాలో నిలిచిన మహిళళ సంపద ఏడాది వ్యవధిలో కనీసం రూ.100 కోట్ల నుంచి రూ.300కోట్లకు పెరగటం ఒక విశేషంగా చెప్పాలి. ఈ జాబితాలో దేశంలోని వివిధ ప్రాంతాల వారు ఉండగా.. అత్యధికులు ఢిల్లీ మహానగరానికి చెందిన వారు 25 మంది ఉంటే.. ముంబయి 21 మంది ఉన్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సంపన్న మహిళలు ఉన్న నగరంగా ముంబయి రెండో స్థానంలో ఉండే.. హైదరాబాద్ 12 మందితో మూడో స్థానంలో నిలిచింది. అపోలో హాస్పిటల్స్ కుచెందిన నలుగురు ఈ జాబితాలో పేరు ఉండటం మరో విశేషంగా చెప్పాలి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి రూ.480 కోట్లతో 77 స్థానంలో నిలిచారు. టాప్ 100లో నిలిచిన సంపన్న మహిళల్ని చూస్తే..

ర్యాంక్ పేరు కంపెనీ పేరు ఆస్తి విలువ (రూ.కోట్లల్లో)
04 నీలిమ దివీస్ ల్యాబ్స్ 28,180
13 మహిమా దాట్ల బయోలాజికల్ ఇ 5530
15 సునీతా రెడ్డి అపోలో హాస్పిటల్స్ 4760
18 సుచరితా రెడ్డి అపోలో సింధూరి హోటల్స్ 3700
21 శోభనా కామినేని అపోలో హాస్పిటల్స్ 2740
23 సంగీతారెడ్డి అపొలొ హాస్పిటల్స్ 2690
29 ప్రీతా రెడ్డి అపోలో హాస్పిటల్స్ 2230
50 ఎన్. నవీన దేవి సీ ఫుడ్స్ 980
50 పి. రమాదేవి దేవి సీ ఫుడ్స్ 980
55 వనజాదేవి కావేర సీడ్ 880
58 స్వర్ణలత గాలివీటి సీఎల్ ఆర్ ప్రాజెక్ట్స్ 850
66 సుప్రితా ఎస్ రెడ్డి విజయా డయాగ్నోస్టిక్స్ 590
69 సుచిత్రా ఎల్ల భారత్ బయోటెక్ 570
72 పద్మజ గంగిరెడ్డి స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్స్ 520
77 నారా భువనేశ్వరి హెరిటేజ్ ఫుడ్స్ 480
83 శాలిని భూపాల్, ఇందిరా క్రిష్ణారెడ్డి తాజ్ జీవీకే 440
93 ఉమాదేవి చిగురుపాటి గ్రాన్యూల్స్ ఇండియా 350
97 అంజనా రెడ్డి యూనివర్సల్ స్ట్పోర్ట్ బిజ్ 300