Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో తనకున్న రిలేషన్ బయటపెట్టిన ఆమె
By: Tupaki Desk | 9 Jan 2023 4:18 AM GMTఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుమారుడినంటూ శివచరణ్ రెడ్డి అనే వ్యక్తి రాసిన లేఖ పెను సంచలనంగా మరాటం తెలిసిందే. హాట్ టాపిక్ గా మారిన ఈ ఎపిసోడ్ కు సంబంధించిన మేకపాటి కుటుంబ సభ్యుల వాదన ఒకలా ఉండటం.. అందుకు భిన్నమైన వ్యాఖ్యలు సదరు వ్యక్తి చేయటం తెలిసిందే. తాజాగా ఈ ఇష్యూలోకి సదరు వ్యక్తి తల్లి ఎంట్రీ ఇచ్చారు. వీడియో సందేశం బయటకు విడుదల చేశారు. అందులో ఆమె ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.
అదే సమయంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన తండ్రి అంటూ శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఉన్న అనుమానాలకు సమాధానంగా ఆమె మీడియో ఉంటుందంటున్నారు. లేఖతో కలకలాన్ని రేపిన శివచరణ్ రెడ్డి తల్లి లక్ష్మీదేవి.. తాజాగా విడుదల చేసిన వీడియోలో ఏముంది? అందులోని అంశాల్ని యథాతధంగా చూస్తే..
"నాకు పదిహేనేళ్ల వయసులో కొండారెడ్డి అనే వ్యక్తితో పెళ్లైంది. ఆయనకు ఇష్టం లేకపోవటంతో రెండేళ్లకే నన్ను వదిలేసి వెళ్లిపోయారు. దీంతో నేను మా పిన్ని ఇంటికి వచ్చాను. ఒక రోజు మా మామ, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుకున్న సమయంలో నా విషయం చర్చకు వచ్చింది. పాపం అమ్మాయి జీవితం నాశనమైందని మా మామ చెప్పారు. అప్పటి నుంచి తాను పెళ్లి చేసుకుంటానని.. ఇంటికి తీసుకెళతానని చంద్రశేఖర్ రెడ్డి నమ్మించారు" అని పేర్కొన్నారు.
ఆ తర్వాత జరిగిన మరిన్ని విషయాల్ని వెల్లడిస్తూ.. "మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో.. రెండేళ్లు మా ఇంటి చుట్టూ తిరిగారు. ఇప్పుడు డబ్బు కోసం వచ్చామని అబద్ధాలు ఆడుతూ అవమానిస్తున్నారు. నన్ను తీసుకెళ్లి బెంగళూరులో కాపురం పెట్టారు. దాదాపు 18 ఏళ్లు మాతోనే ఉన్నారు. బాబు శివచరణ్ రెడ్డిని బాగా చూసుకునేవారు. ప్రస్తుతం ఆయనకు శాంతకుమారితో పరిచయమైంది. మా ఇంటికి రావటం తగ్గించారు. అది తెలిసి మందలిస్తే పూర్తిగా రావటం మానేశారు. అప్పటి నుంచి మేం కష్టాలు పడుతూనే ఉన్నాం. నన్ను ఇంట్లో నుంచి తీసుకొచ్చి బజారుపాలు చేసినా ఒక్కమాట అడిగానా? మీ అంతట మీరే వచ్చారు. మీరే వెళ్లారు. మీ మాటలతో అవమానం భరించలేక.. ఇన్నేళ్ల తర్వాత బయటకు రావాల్సి వచ్చింది. డబ్బు కోసం వచ్చానని మాట్లాడతారా? రండి చూద్దాం. ఎవరి దగ్గర ఎంత డబ్బుందో? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.