Begin typing your search above and press return to search.
రోజంతా అధికారుల్ని పరుగులు తీయించిన ఆమె
By: Tupaki Desk | 30 Nov 2021 6:30 AM GMTకరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు పలు దేశాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దాంతో లింకు ఉందన్న అనుమానం ఏ మాత్రం వచ్చినా.. పెడుతున్న పరుగులు అన్ని ఇన్ని కావు. తాజాగా మధ్యప్రదేశ్ లో ఇలాంటి అనుభవమే అధికారులకు ఎదురైంది. ఒమిక్రాన్ వేరియంట్ ఎక్కువగా ఉన్న దక్షిణాఫ్రికాలోని బోట్స్ వానాకు చెందిన మహిళ ఒకరు ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్ కు వచ్చిందన్న విషయాన్ని అధికారులు గుర్తించారు.
ఆమె వచ్చిన నాటికి ఒమిక్రాన్ తీవ్రత మీద పెద్దగా అవగాహన లేదు. ఎప్పుడైతే.. ఈ అంశం మీద అవగాహన వచ్చిందో.. ఆ వెంటనే.. అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆమె ఎవరు? ఎక్కడ ఉన్నారు? ఎందుకు వచ్చారు? లాంటి ప్రశ్నలు ఎన్నో ఎదురయ్యాయి. ఆర్మీలో కెప్టెన్ గా పని చేస్తున్న 34 ఏళ్ల ఒరీమెట్సో లిన్ ఖుమో అధికార పర్యటనలో భాగంగా భారత్ కు వచ్చారు.
ఈ నెల 18న ఢిల్లీ నుంచి జబల్ పూర్ లోని ఆర్మీ కాలేజీ ఆఫ్ మెటీరియల్ మేనేజ్ మెంట్ కు వచ్చారు. కొవిడ్ ప్రోటోకాల్ లో భాగంగా విదేశీయుల పర్యటన వివరాల్ని రాష్ట్రాలతో పంచుకున్న కేంద్రం.. ఆమె సమాచారాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చారు. రెండు రోజుల క్రితం జబల్ పూర్ కు వచ్చారన్న సమాచారం తప్పించి.. ఆమె ఎవరు? ఎక్కడకు వచ్చారు? లాంటి సమాచారం ఇవ్వలేదు.
వచ్చిన మహిళ.. ఒమెక్రోన్ పుట్టినిల్లు లాంటి ప్రాంతం నుంచి రావటంతో అధికారులు ఒక్కసారిగా అలెర్టు అయ్యారు. ఆమె ఆచూకీ కోసం.. ఆమె ఎక్కడ ఉందన్న విషయాన్ని తెలుసుకునేందుకు భారీ కసరత్తే చేశారు. ఉరుకులు.. పరుగులతో ఆమె ఆచూకీ తీసే ప్రయత్నంచేశారు. ఇలా గంటల కొద్దీ ప్రయాస తర్వాత ఆమె ఆచూకీ లభించింది. ఆమె స్థానిక ఆర్మీ కాలేజీలో ఉన్నట్లుగా గుర్తించారు.
ఆ వెంటనే హుటాహుటిన ఆమె వద్దకు వెళ్లిన అధికారులు.. ఆమెకు కొవిడ్ పరీక్షల్ని నిర్వహించారు. సదరు పరీక్షలో నెగిటివ్ ఫలితం వచ్చాక కానీ అధికారులు స్థిమితపడలేదు. ఆమెకు పూర్తిస్తాయిలో వ్యాక్సినేషన్ జరిగిన విషయాన్ని ఆమె వద్ద ఉన్న పత్రాలతో గుర్తించిన తర్వాత కానీ వారి టెన్షన్ తీరలేదు. మొత్తంగా సదరు మహిళా అధికారులు రేపిన కలకలం అంతా ఇంతా కాదని చెప్పాలి.