Begin typing your search above and press return to search.
షీలమ్మ నోట యువరాజు సామర్థ్యం మాట
By: Tupaki Desk | 14 April 2015 7:16 PM GMTఎక్కడికి వెళ్లాడో తెలీదు కానీ.. దాదాపు 50రోజులకు పైనే అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్‌గాంధీ తీరుపై అసంతృప్త గళాలు ఒకటి తర్వాత ఒకటిగా బయటకు వస్తున్నాయి.
సోనియమ్మ మీద అలిగి సెలవు మీద వెళ్లిపోయారన్న మాట ఓ పక్క వినిపిస్తుంటే.. అందులో నిజం లేదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రాహుల్ బ్యాచ్ పూర్తిగా విభేదించే సోనియమ్మ బ్యాచ్‌కు చెందిన నేతలు ఒకరు తర్వాత ఒకరుగా రాహుల్‌పై విమర్శలు చేయటం విశేషం. ఆ మధ్య దిగ్విజయ్ సింగ్ రాహుల్ సెలవులపై విమర్శలు చేయటం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రికార్డు సమయం సేవలు అందించిన షీలాదీక్షిత్ గళం విప్పారు. రాహుల్‌గాంధీ నాయకత్వ సామర్థ్యం మీద సందేహాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
రాహుల్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పజెబితే ఎలా ఉంటుందో తనకు అర్థం కావటం లేదన్న వ్యాఖ్యలు చేసిన ఆమె.. ప్రస్తుతం సోనియమ్మ నాయకత్వంలో తామంతా సుఖంగా ఉన్నామని.. ప్రస్తుతానికి నాయకత్వ మార్పు అవసరం లేదన్న వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహుల్ నాయకత్వ సామర్థ్యంపై విమర్శలు చేయాల్సిన అవసరం షీలమ్మ లాంటి నేతలకు ఉందా? అయినప్పటికీ విమర్శలు చేశారంటే.. లోగుట్టు ఏమిటో..?