Begin typing your search above and press return to search.
షీనా మర్డర్ మిస్టరీ అలా బయటకొచ్చిందట
By: Tupaki Desk | 18 Oct 2015 9:42 AM GMTనేరాన్ని దాచటం అంత తేలిక కాదు. గుట్టుచప్పుడు కాకుండా కన్నకూతుర్ని చంపేసి.. ఏమీ తెలీనట్లుగా ఉన్న షీనాబోరా హత్య కేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీతో పాటు.. హత్యకు పాల్పడిన వారంతా కటకటాల వెనుక్కు వెళ్లటం తెలిసిందే. అప్పుడెప్పుడో మూడేళ్ల క్రితం జరిగిన హత్య వ్యవహారం ఎలా బయటకు వచ్చింది? తాజా కోణంలో పోలీసులు ఎలా ఆలోచించారు? అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. ఆశ్చర్యకరమైన సమాధానాలు వస్తాయి.
గుట్టు చప్పుడు కాకుండా.. ఎవరికి అనుమానం రాకుండా హత్య ను పూర్తి చేసినా.. హత్యకు సహకరించిన వ్యక్తి అత్యుత్సాహం.. మద్యం అలవాటు నిప్పు లాంటి నిజం బయటకు వచ్చేలా చేసింది. ఈ ఆసక్తికర విషయాన్ని ఒక పోలీసు అధికారి తాజాగా బయట పెట్టారు. ఆయన చెప్పిన వివరాలు చూస్తే..
షీనాబోరా హత్యలో ఆమె తల్లి ఇంద్రాణి.. రెండో భర్త సంజీవ్ ఖన్నా.. డ్రైవర్ శ్యామ్ రాయ్ లు కలిపి చేసిన విషయం తెలిసిందే. అనుకున్న విధంగా హత్యను పూర్తి చేసిన వారంతా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఈ క్రమంలో హత్యకు సహకరించిన డ్రైవర్ శ్యామ్ రాయ్ కు ఇంద్రాణి రూ.5లక్షలు ఇచ్చారు. ఈ భారీ మొత్తాన్ని తీసుకొని ఊరికి వెళ్లిన అతడు నమ్మకస్తుడైన స్నేహితుడికి ఆ డబ్బులు ఇచ్చి.. ముంబయిలో ఆటోవాలాగా అవతారం ఎత్తాడు.
ఇతగాడు తన స్నేహితులైన తోటి ఆటోడ్రైవర్లకు మందు పార్టీలు ఇచ్చేవారు. అలా పార్టీలు ఇచ్చిన క్రమంలో.. ఒకసారి మందుమత్తు పూర్తిగా కమ్మి.. మనసులో దాచుకున్న నిజాన్ని తోటి మిత్రులకు గొప్పగా చెప్పుకొచ్చాడు. అయితే.. అలా పార్టీ తీసుకున్న ఆటోవాలాలలో.. పోలీసు ఇన్ ఫార్మర్ ఒకరున్నారు. తాము హత్య చేసిన విధానాన్న పూసగుచ్చినట్లుగా చెప్పిన వైనాన్ని.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లటం.. వెంటనే శ్యమ్ ను అదుపులోకి తీసుకొని.. తమదైన శైలిలో విచారించేసరికి.. అసలు గుట్టు విప్పాడు. దీంతో కేసు నమోదు చేసి.. నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిజం నిప్పులాంటిదని.. తప్పు చేసిన వారికి శిక్ష ఎప్పటికైనా తప్పదన్న విషయం తాజా ఉదంతం మరోసారి నిరూపించిందని చెప్పొచ్చు.