Begin typing your search above and press return to search.
నాన్ వెజ్ ప్రియులకు వార్నింగ్.. ఆ జిల్లాలో గొర్రెలకు ఆంత్రాక్స్!
By: Tupaki Desk | 27 Oct 2021 4:16 AM GMTనాన్ వెజ్ అంటే ఇష్టం. అందులోనూ మటన్ అంటే మరింత ఇష్టం. ఇలాంటి వారంతా కాసింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. తెలంగాణ లోని వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండలోని నాలుగు గొర్రెలు ఆంత్రాక్స్ వ్యాధితో మరణించిన వైనంతో అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ముందస్తు జాగ్రత్తగా రాష్ట్ర పశు సంవర్ధక శాఖకు చెందిన సిబ్బంది.. ఆంత్రాక్స్ బయటపడిన చుట్టుపక్కల ప్రాంతాల్లోని గొర్రెలకు.. మేకలకు టీకాలు వేయటం షురూ చేశారు. రాష్ట్రంలోని మిగిలిన చోట్ల ఇలాంటివి కనిపించకున్నా.. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందే.
మేక.. గొర్రె మాంసం కొనే ముందు ఆ జీవాల్ని పశు వైద్యులు తనిఖీ చేశారా? లేదా? అన్నది పక్కాగా నిర్దారించుకున్న తర్వాతే కొనుగోలు చేయటం మంచిది. ఒకవేళ దుకాణదారులు చెప్పిన మాట పై అనుమానం ఉంటే.. జీవాల్ని కోసిన ప్రాంతాల్ని ఒకసారి చూడటం మంచిదని చెబుతున్నారు. జీవాల్ని కోసినప్పుడు వెలువడే రక్తం వెంటనే గడ్డ కట్టకుండా ద్రవరూపం లో ఉంటే ఆ జీవానికి ఆంత్రాక్స్ సోకినట్లేనని భావించొచ్చు.
వ్యాధిగ్రస్త మైన జీవాల మాంసాన్ని తినటం.. తాకటం.. అమ్మకం లాంటివి చేయొద్దని గొర్రెల కాపరులకు.. అమ్మకందార్లకు అధికారులు ఇప్పటికే అప్రమత్తంగా చేశారు. పశువులు.. మేకలు.. గొర్రెల కు సోకే దొమ్మరోగం.. నెత్తురెంక.. రక్తపు దొమ్మ వ్యాధిని ఇంగ్లిషు లో ఆంత్రాక్స్ గా వ్యవహరిస్తారు. జీవాలు తాగే నీటిలో కానీ తినే ఆహారంలో కానీ ఇతర కీటకాల ద్వారా వాటి రక్తం లోకి ఈ వైరస్ ప్రవేశించి.. వేగంగా రెండు.. మూడు రోజులకే వాటి ప్రాణాల్ని తీస్తుంది. ఇలా వ్యాధి సోకిన జంతువుల కళేబరాల్ని ఊరికి దూరంగా మూడు అడుగుల లోతు గొయ్యి తవ్వి సున్నం వేసి పూడ్చి పెట్టాల్సిన అవసరం ఉంది.
అవి చనిపోయిన ప్రాంతం లోని చెత్తనంతా తగల బెట్టేయాలి. కొన్నిసార్లు ఆయా జీవాలు ఆంత్రాక్స్ తో చనిపోయిన విషయం తెలియక.. వాటిని కోసి మాంసాన్ని ఇతరుల కు అమ్మటం కానీ కాపరులే తినటం కానీ చేస్తుంటారు. కొందరు వాటి చర్మాన్ని ఒలిచి తీసుకుంటారు. అయితే.. ఇలా వ్యాధి సోకిన జీవితాల్ని ముట్టుకున్నా.. వాటి మాంసాన్ని తినే కాకులు.. కుక్కలు.. ఇతర పురుగుల్లోనూ ఈ వైరస్ ప్రవేశించే అవకాశం ఉందన్నది మర్చిపోకూడదు. ఎక్కడైనా అకస్మాత్తుగా పశువులు.. గొర్రెలు.. మేకల నుంచి నల్లటి రక్తం కారుతుంటే వాటికి ఆంత్రాక్స్ సోకిందని గుర్తించి.. వెంటనే పశువైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. సో.. నాన్ వెజ్ ప్రియులు కాసింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నది మర్చిపోకూడదు.