Begin typing your search above and press return to search.
సంచలనంగా మారిన కశ్మీర్ గ్రౌండ్ రిపోర్ట్.. ఎవరు చెప్పారంటే..
By: Tupaki Desk | 19 Aug 2019 7:39 AM GMTజమ్ముకశ్మీర్ లో పరిస్థితి ఎలా ఉంది? అన్న ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పలేని పరిస్థితి. మొన్నటి వరకూ కశ్మీర్ పరిస్థితిపై పెద్ద ఎత్తున కవరేజ్ ఇచ్చిన జాతీయ.. ప్రాంతీయ మీడియా సంస్థలు.. ఇప్పుడా విషయానికి అట్టే ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఎందుకని? అన్నది ఒక ప్రశ్న. ఇదిలా ఉంటే.. తాజాగా జవహార్ లాల్ నెహ్రూవర్సిటీ విద్యార్థి నేత షీలా రషీద్ తాజాగా సంచలన ట్వీట్లను పోస్ట్ చేశారు.
కశ్మీరీ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయంపైన ఆమె చేసిన ట్వీట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. స్థానిక పోలీసులకు ఎలాంటి అధికారాలు లేవని.. మిలిటరీ బలగాలు హింసకు దిగుతున్నాయని ఆరోపించారు.
ఆర్మీ జవాన్లు ఇళ్లల్లోకి చొరబడి యువకుల్ని అకారణంగా తమతో తీసుకెళుతున్నట్లుగా ట్వీట్లు చేశారు. మొత్తంగా పది అంశాల్ని ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ అంశాలేమంటే..
% కశ్మీర్ లో మీడియా నిలిపివేయబడింది
% పెట్రోల్ బంకులు మూసివేశారు
% మెడిసిన్స్ కోసం ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణించాల్సి వస్తోంది
% సమాచార వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ఎలాంటి సమాచారం ప్రజలకు అందటం లేదు
% డీటీహెచ్ రీచార్జ్ చేసుకునే వెసులుబాటు లేదు. అతి కొద్దిమంది మాత్రమే టీవీ చూసే వీలుంది.
% శాంతిభద్రతలపై కశ్మీరీ పోలీసులకు ఎలాంటి అధికారాలు లేవు. అంతా పారామిలటరీ దళాల చేతిలోనే ఉంది
% జమ్ముకశ్మీర్ పోలీసుల చేతుల్లో లాఠీలు మాత్రమే ఉన్నాయి. సర్వీసు రివాల్వర్ల మీద కన్నెత్తి చూడట్లేదు
% రాత్రి వేళల్లో పారామిలటరీ దళాలు ఇళ్లల్లోకి వెళ్లి యువకుల్ని తీసుకెళుతున్నారు
% ఇళ్లల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇంట్లో ఉన్న రేషన్ ను చెల్లాచెదురు చేస్తున్నారు.
% షోపియన్‌లో నలుగురు యువకుల్ని ఆర్మీ క్యాంప్ లోకి పిలిచి హింసించారు. వారి దగ్గర ఒక మైక్ పెట్టి వారి అరుపుల్ని ఆ ప్రాంతంలోని వారికి వినిపించి భయభ్రాంతులకు గురి చేశారు. భయానక వాతావరణం జమ్మూ కశ్మీర్‌లో ఉంది.