Begin typing your search above and press return to search.
యువరాణి సేఫ్.. ఫ్రూప్ కానీ వీడియో ఫుటేజ్ కానీ చూపించలేదు
By: Tupaki Desk | 21 Feb 2021 10:30 AM GMTఇప్పుడు నడుస్తున్న డిజిటల్ ప్రపంచంలోనూ రాజ్యాలు.. రాజులు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. ప్రపంచంలోని చాలా దేశాలు.. రాజరిక పాలనలోనే మగ్గుతున్నాయి. కొందరు రాజులు మారే కాలానికి తగ్గట్లు మారి.. తమ మీద ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరికొందరు మాత్రం అవేమీ పట్టనట్లుగా తమకు తోచినట్లుగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. కన్నకూతురు విషయంలో మాత్రం కరకుగా వ్యవహరిస్తూ తరచూ వార్తల్లోకి వస్తున్నారు యూఏఈ ప్రధాని.. దుబాయి రాజు షేక్ మహమ్మద్. కుమార్తెను బంధించటమే కాదు.. ఆమె స్వేచ్ఛను హరిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
పేరుకు యువరాణి మాత్రమే కానీ.. తన పరిస్థితి ఏ మాత్రం బాగోలేదంటూ బాత్రూంలో తీసుకున్న సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసిన లతిఫా మాటలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారాయి. తనకు స్వేచ్ఛను ప్రసాదించాలన్న ఆమె మాటలకు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం స్పందించింది. లతీఫా సేఫ్ గా ఉందన్న ఆధారాలు చూపించాలని యూఏఈని కోరింది.
దీంతో స్పందించిన యూఏఈ తాజాగా తన స్పందనను ప్రపంచానికి తెలియజేసింది. లతీఫా క్షేమంగా ఉన్నారని. ఆమె యోగక్షేమాల గురించి ఆందోళన చెందిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు.. వైద్యులు ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నట్లుగా పేర్కొంది. ఆమె ఆరోగ్యం కుదుటపడినతర్వాత.. సరైన సమయం చూసుకని అందరి ముందుకు వస్తారని తాము ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఇన్ని మాటలు చెప్పిన యూఏఈ.. అందుకు తగ్గ ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ చూపించకుండా నోటిమాటలకే పరిమితమైంది. యోగక్షేమాల్ని అడిగే యూఎన్.. ఆమెను ప్రపంచం ముందుకు తీసుకురావాలని ఎందుకు కోరుకోవటం లేదు? అన్నది ప్రశ్న. మరి.. దీనికి యూఏఈ ఏమని సమాధానం చెబుతుందో చూడాలి.