Begin typing your search above and press return to search.

ట్రంప్ ఖర్చు భరించే మొనగాడు బయటకొచ్చాడు

By:  Tupaki Desk   |   19 March 2016 9:36 AM GMT
ట్రంప్ ఖర్చు భరించే మొనగాడు బయటకొచ్చాడు
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలోకి దిగాలని భావిస్తున్న బిలియనీర్ డోనాల్డ్ ట్రంప్ కు ఓ పెద్ద అండ లభించింది. ట్రంప్ తరచూ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయనపై పెద్దఎత్తున విమర్శలు రావటంతో పాటు.. రిపబ్లికన్ల ఇమేజ్ భారీగా డ్యామేజ్ అవుతుందన్న భావన వ్యక్తమవుతోంది. దీంతో.. ట్రంప్ ను ఏదోలా వదిలించుకోవాలని రిపబ్లికన్లు భావిస్తున్నాయి. అయితే.. అలాంటిదేమైనా చేస్తే.. పెద్ద ఎత్తున గొడవలు జరిగే అవకాశం పక్కా అంటూ ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చేస్తున్న ట్రంప్ తో రిపబ్లికన్లు బిత్తరపోయే పరిస్థితి.

ఇదిలా ఉంటే.. తాజాగా ట్రంప్ కు ఆర్థికంగా మద్దుతు ఇచ్చేందుకు.. ఆయన ఎన్నికల ప్రచారానికి భారీగా ఖర్చు చేసేందుకు వీలుగా అమెరికన్ బిలియనీర్ షెల్డన్ అడెల్సన్ సానుకూలంగా ఉండటమే కాదు.. ట్రంప్ కు అయ్యే ఖర్చులో భారీ మొత్తాన్ని భరించేందుకు సిద్దంగా ఉండటం రిపబ్లికన్లను బిత్తరపోయేలా చేస్తుంది.

కింగ్ మేకర్ గా చెప్పే అడెల్సన్ .. 2012 ఎన్నికల్లో ఒబామాను ఓడించేందుకు అడెల్సన్ దాదాపు 150 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టినట్లుగా చెబుతుంటారు. అలాంటి వ్యక్తి మద్దతు ట్రంప్ కు లభించటంతో ఆయన అభ్యర్థిత్వం ఖరారు కానుందా? అన్నది ఒక ప్రశ్న. ట్రంప్ కు అడెల్సన్ మద్దతు ఎందుకు ఇస్తున్నారన్న ప్రశ్నకు పలువురు చెబుతున్నకారణాలు.. ఇద్దరూ వ్యాపారవేత్తలమని.. వేలాది మందికి ఉపాధిని కల్పించటంతో పాటు.. ఇజ్రాయిల్ – పాలస్తీనా వివాదంలో తటస్థంగా ఉండటం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. నిప్పును గాలి తోడైనట్లు ట్రంప్ కు అడల్సన్ తోడు అయితే.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు హాట్ హాట్ గా సాగటం ఖాయమని చెప్పొచ్చు.