Begin typing your search above and press return to search.
జయరాం తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు!
By: Tupaki Desk | 4 Feb 2019 5:20 AM GMTసంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త జయరాం హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ ను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా చిల్లకల్లులోని రామ్ కో సిమెంట్ గెస్ట్ హౌస్ లో ఉంచి విచారిస్తున్నారు. ఎస్పీ త్రిపాఠి ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతోంది. అలాగే వత్సవాయి పోలీస్ స్టేషన్ లో ఓ మహిళ, మరో ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు.
ఇక ఈ కేసులో జయరాం మేనకోడలు కీలక వివరాలను పోలీసులకు అందించింది. జయరాం హత్యతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పారు. అయితే రాకేశ్ రెడ్డిని మాత్రం జయరాంకు పరిచయం చేసింది తానేనన్నారు. రాకేశ్ ఏ పని చేయడని, కాకపోతే పెద్ద పెద్ద వ్యక్తుల మధ్య సంబంధాలు కలుపుతూ బ్రోకర్ గా వ్యవహరిస్తాడని తెలిపింది.
రాకేశ్ తనకు డబ్బులు ఇవ్వలేదని, జయరాంకు మాత్రం 4.5 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చాడని పోలీసుల విచారణలో శిఖా చౌదరి తెలిపింది. తాను పెద్ద బిజినెస్ మ్యానే అయినా చెక్ పవర్ తన భార్య వద్ద ఉందని, అందుకే జయరాం విపరీతమైన అప్పులు చేశాడని పేర్కొంది. రాకేశ్ దగ్గర తీసుకున్న అప్పు జయరాం చెల్లించకపోవడంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని శిఖా చౌదరి తెలిపింది.
శిఖాచౌదరి మరో షాకింగ్ వాంగ్మూలం ఇచ్చింది. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న శిఖా చౌదరి ఆ తరువాత రాకేశ్ తో డేటింగ్ లో పాల్గొంటోంది. ఈ తరుణంలో జయరాం తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని పేర్కొంది. జయరాం వ్యక్తిగతంగా మంచివాడు కాదని, తనతో పాటు తన చెల్లితో కూడా లైంగిక సంబంధాన్ని కొనసాగించాడని శిఖాచౌదరి పోలీసుల ఎదుట వెల్లడించినట్టు సమాచారం.. అయితే వారి ఇళ్లకు తరుచూ జయరాం రావడంతో రాకేశ్ అడ్డు చెప్పేవాడని, దీంతో వీరి మధ్య గొడవలు జరిగేవని.. అదే హత్యకు దారితీసిందని శిఖా చౌదరి పేర్కొంది.