Begin typing your search above and press return to search.
పోలీస్ స్టేషన్ కు శిఖా వచ్చిన తీరు ఇలా!
By: Tupaki Desk | 14 Feb 2019 11:27 AM GMTపాపం.. పుణ్యం సంగతులు తెలీని పరిస్థితి. ప్రవాసాంధ్రుడు.. పారిశ్రామికవేత్త.. వందల కోట్ల ఆస్తిపరుడిగా పేరున్న జయరామ్ చిగురుపాటి దారుణ హత్య సినిమా స్టోరీని తలపించేలా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ హత్య కేసులో మొదట్నించి వినిపిస్తున్న పేర్లలో శిఖా చౌదరి ఒకటి. ఇటీవల ఆమె ఒక చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ.. తనకు సంబంధం లేకున్నా.. తన పాత్ర ఉందన్నట్లుగా.. మీడియాలో తన పేరును అదే పనిగా వాడేసిన వైనంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేశ్ రెడ్డి.. శ్రీనివాస్ లను మూడు రోజులుగా కస్టడీలోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో సంబంధం ఉందని భావించిన శిఖా చౌదరి పాత్ర ఏమీ లేదని ఏపీ పోలీసులు తేల్చగా.. తెలంగాణ పోలీసులు మరోసారి ఆమెను విచారించేందుకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు పిలిపించారు.
తాజాగా ఈ హత్య కేసుతో సంబంధం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్న 30 మందిని పోలీస్ స్టేషన్ కు పిలిచారు. ఇందులో సినీ నటుడు.. కమెడియన్ పాత్రలు వేసే డుంబును కూడా విచారించారు. అతనికి ఎలాంటి సంబంధం లేదని తేలిన తర్వాత వదిలేశారు.
ఇదిలా ఉంటే.. పోలీసుల విచారణ కోసం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన శిఖా చౌదరి తన తీరుతో అందరి దృష్టిలో మరోసారి పడ్డారు. పైనుంచి కింద వరకూ బురఖా లాంటి వస్త్రాన్ని ధరించి ఆమె స్టేషన్ కు వచ్చారు.ముఖానికి స్కార్ఫ్ ను కట్టుకొచ్చిన ఆమెను తొలుత గుర్తించలేదు. తర్వాత ఆమెను శిఖా చౌదరిగా గుర్తించారు. మీడియా కంట్లో పడకూడదన్న ఉద్దేశంతోనే పోలీస్ స్టేషన్ కు ఆమె అలా వచ్చి ఉంటారని భావిస్తున్నారు.