Begin typing your search above and press return to search.

శిల్పబెయిల్ విచారణ వాయిదా: 28 వరకు రిమాండ్

By:  Tupaki Desk   |   15 Dec 2021 11:32 AM GMT
శిల్పబెయిల్ విచారణ వాయిదా: 28 వరకు రిమాండ్
X
కిట్టీ పార్టీల పేరుతో కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరి బెయిల్ పిటిషన్ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆమె వేసిన బెయిల్ పిటిషన్ ను ఉప్పరపల్లి కోర్టు బుధవారం వాయిదా వేసింది. ఈనెల 28నాటికి విచారణ వాయిదా వేసింది. దీంతో ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు. దీంతో మరో 14 రోజుల పాటు ఆమె జైలు జీవితం గడపనుంది.

గత కొన్ని రోజులుగా పోలీస్ కస్టడీలో ఉన్న శిల్పా చౌదరిని బుధవారం ఉప్పరపల్లి కోర్టులు ప్రవేశపెట్టగా బెయిల్ పై విచారణను వాయిదా వేయడంతో శిల్పాకు చుక్కెదురైనట్లయింది.

ఉన్నత వర్గాలకు చెందిన మహిళల నుంచి కోట్ల రూపాయలు సేకరించిన శిల్పా చౌదరిని వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి తీసుకున్నారు. ఆమెను పలు కోణాలో విచారించారు. అయితే శిల్పా మొదటల్లో సహకరించలేదు.

తనకు ఏ విషయం తెలియదని చెప్పారు. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం చెప్పింది. అయితే రోజుకో రకంగా శిల్పా సమాధానం చెప్పడంతో ఆమెను కస్టడీని పొడగిస్తూ వచ్చారు. మరోవైపు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో విచారణ ఆలస్యమైంది.

అంతేకాకుండా ఒక్కోసారి మోసం చేశానని.. మరోసారి తానే మోసపోయానని పోలీసులకు తెలపడంతో అయోమయంలో పడ్డారు. అయితే మొత్తంగా ఆమె చెప్పిన వివరాల ఆధారంగా కీలక అధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. శిల్ఫా చౌదరి స్టార్ హీరో సుధీర్ భార్య ప్రియదర్శిని, రేణుకారెడ్డి, దివ్యారెడ్డి ల నుంచి శిల్పా చౌదరికి రూ.7కోట్లు సేకరించానని తెలిపింది.

కానీ శిల్ప చౌదరి మాత్రం ప్రియదర్శినిపై ముందుగా అనేక ఆరోపణలు చేసినట్లు సమాచారం. ఆ తరువాత బాధితుల నుంచి సేకరించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్లు తెలిపినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరి బ్యాంకు అకౌంట్లను పరిశీలించిన పోలీసులకు షాక్ తగిలింది. వారిద్దరి అకౌంట్లలో కేవలం రూ.16 వేలు, 15 వేలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఇంతమొత్తం డబ్బు ఎక్కడ పెట్టారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

శిల్పా చౌదరి మోసాలకు పాల్పడే ముందు అమెరికాలోని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కొన్నాళ్లు పనిచేసింది. ఆ తరువాత ఇండియాకు వచ్చి కిట్టీ పార్టీలను స్ట్రాట్ చేసింది. ఉన్నత వర్గాల మహిళలను లక్ష్యంగా చేసుకొని వారికి అధిక వడ్డీ ఇస్తానని డబ్బలు సేకరించింది.

అయితే ఆ మొత్తాన్ని బ్యాంకులో వేయకుండా శిల్పాచౌదరి విదేశాలకు పంపారని అనుమానిస్తున్నారు. తమ మోసం ఎన్నిటికైనా బయటపడుతుందని హవాలా రూపంలో ఇతర దేశాలకు పంపినట్లు అనుకుంటున్నారు.

శిల్పా చౌదరిపై ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని, సహా మూడు కేసుల్లో రూ. 7 కోట్లకు సంబంధించిన డబ్బులు తిరిగి ఇస్తానని తెలిపింది. దీంతో ఆమె బ్యాంకు అకౌంట్లలో లేని డబ్బుఎక్కడి నుంచి తీసుకొస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే తాను రాధికారెడ్డి అనే మహిళకు రూ.10 కోట్లు ఇచ్చానని తెలిపింది. ఈ విషయంలో పోలీసులతో శిల్పా చౌదరి వాగ్వాదం కూడా పెట్టుకుంది. అయితే అందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం చూపలేదు. దీంతో నార్సింగ్ పోలీసులు శిల్పా చౌదరి నుంచి మరిన్ని వివరాలు సేకరించే పనిలో పడ్డారు.