Begin typing your search above and press return to search.

మాట కోసం ఛైర్మ‌న్ గిరిని కాద‌న్న 'శిల్పా'

By:  Tupaki Desk   |   16 Aug 2017 6:18 AM GMT
మాట కోసం ఛైర్మ‌న్ గిరిని కాద‌న్న శిల్పా
X
మాట అంటే మాట‌. ఇదొక్క‌ప్ప‌టి మాట‌. ఇప్ప‌టి రోజుల్లో మాట‌కు విలువ ఇచ్చే వారు.. మాట మీద నిల‌బ‌డ‌టం కోసం ఎన్నిక‌ష్టాల‌కైనా సై అనే వారు అరుదుగా క‌నిపిస్తుంటారు. సోనియాగాంధీతో రాజీ చేసుకుంటే అంతా పూల‌పాన్పే. కానీ.. అలాంటి వాటిని సైతం వ‌దులుకొని క‌ష్టాలు ఎదుర్కొనేందుకు గుండెధైర్యం చాలానే కావాలి. అలాంటి తెగువ‌.. ధైర్యం త‌న‌లో ట‌న్నుల ట‌న్నులు ఉంద‌న్న విష‌యాన్ని ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎప్పుడో నిరూపించారు.

స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో న‌మ్మిన‌దాని కోసం స‌మ‌స్య‌కు ఎదురుగా వెళ్లేందుకు సైతం వెనుకాడ‌ని త‌త్త్వం త‌న సొంత‌మ‌న్న విష‌యాన్ని జ‌గ‌న్ ఎప్పుడో ఫ్రూవ్ చేశారు. ఒకే గూటి ప‌క్షులు ఒకేచోట‌కు చేర‌తాయ‌న్న‌ట్లుగా తాజాగా శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ఉదంతాన్ని చూస్తే.. ఇదే విష‌యం గుర్తుకు రాక మాన‌దు.

ప‌ద‌వి కోసం విలువ‌ల్ని ప‌క్క‌న పెట్టేసే నేత‌లు ఎంద‌రో ఉన్న ఈ రోజుల్లో.. త‌న ఎమ్మెల్సీ ప‌ద‌విని తృణ‌ప్రాయంగా విడిచి పెట్టిన శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల్లో స‌రికొత్త సంస్కృతిని షురూ చేశార‌ని చెప్పాలి. పార్టీ మారిన వెంట‌నే.. గ‌త పార్టీ తాలూకు వ‌చ్చే ప‌ద‌వుల్ని విడిచి పెట్టాల‌న్న జ‌గ‌న్ మాట‌ను ఫాలో అయిన ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎమ్మెల్సీ ప‌ద‌వినే కాదు.. చ‌క్ర‌పాణి రెడ్డి అంత‌కు మించిన ప‌ద‌విని కూడా వ‌దులుకున్న విష‌యం ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌స్తుతం ఏపీ శాస‌న‌మండ‌లికి ఛైర్మ‌న్ లేరు. దాన్ని నియ‌మించాల్సిన అవ‌స‌రం ఉంది. చ‌క్ర‌పాణి రెడ్డి కానీ టీడీపీలో కంటిన్యూ అయి ఉంటే.. ఆ ప‌ద‌విని ఆయ‌న‌కు క‌ట్ట‌బెడ‌తాన‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎప్పుడో హామీ ఇచ్చారు.

కానీ.. త‌న సోద‌రుడి కంటే ప‌ద‌వులు పెద్ద ముఖ్యం కాద‌న్న‌ట్లుగా శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ఆ విష‌యాన్ని ప‌ట్టించుకోలేద‌ని చెబుతున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌లో శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డికి శ్రీశైలం టికెట్టు ఇచ్చారు. అయితే.. ఆయ‌న అక్క‌డ ఓడిపోవ‌టంతో ఆయ‌న‌కు ఎమ్మెల్సీని క‌ట్ట‌బెట్టారు బాబు. మండ‌లి ఛైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న చ‌క్ర‌పాణి ప‌ద‌వీకాలం పూర్తి అయిన వెంట‌నే.. సీమ‌కు చెందిన చ‌క్రపాణిరెడ్డికి మండ‌లి ఛైర్మ‌న్ ప‌ద‌విని ఇస్తాన‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చిన‌ట్లు చెబుతారు. అయితే.. సోద‌రుడు కోసం.. ఆయ‌న న‌మ్మిన దాని కోసం పెద్ద ప‌ద‌విని సైతం వ‌దులుకొని వైఎస్సార్ కాంగ్రెస్ లో చేర‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొంద‌రికి ప‌ద‌వుల కంటే మాట ముఖ్య‌మ‌ని చెబుతుంటారు. ఆ కోవ‌లోకే వ‌స్తారు శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి కూడా.