Begin typing your search above and press return to search.

వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ...నిజమేనా?

By:  Tupaki Desk   |   18 July 2017 8:30 AM GMT
వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ...నిజమేనా?
X
ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీలోకి మ‌రోమారు వ‌ల‌సలు మొదలుకానున్నాయా? ఈ ద‌ఫా అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఫ్యాన్ పార్టీలో చేరుతారా? అందులోనూ కీల‌క‌ ప్ర‌జాప్ర‌తినిధి ఒక‌రు టీడీపీకి గుడ్‌ బై చెప్ప‌నున్నారా? సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం ప్రకారం చూస్తే ఇది నిజ‌మే అనిపిస్తోంది. క‌ర్నూలు జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీలో చేరనున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌న అన్న శిల్పామోహన్‌ రెడ్డి కోసం చ‌క్ర‌పాణిరెడ్డి సైతం పార్టీ మారుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అధికార తెలుగుదేశం పార్టీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీకి నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఆయా పార్టీ నేత‌లు త‌మ బ‌లాబ‌లాలు పెంచుకునే ప‌నిలో ప‌డ్డారు. ఈ క్ర‌మంలో తాజాగా సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం త‌న సోదరుడైన శిల్పా మోహ‌న్ రెడ్డి గెలుపు కోసం చ‌క్ర‌పాణిరెడ్డి సైతం ప్ర‌తిప‌క్ష వైసీపీలో చేర‌నున్నార‌ట‌. ఉప ఎన్నిక‌లో పోటీచేసే అవ‌కాశం తెలుగుదేశం పార్టీ త‌మ కుటుంబానికి ఇవ్వ‌నందుకు నిర‌స‌న‌గా చ‌క్ర‌పాణి రెడ్డి ఈ నిర్ణ‌యం తీసుకోనున్నార‌ని అంటున్నారు. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల అయిన త‌ర్వాత ఈ చేరిక ఉంటుంద‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

అయితే సోష‌ల్ మీడియా వేదిక‌గా, స్థానికంగా కూడా సాగుతున్న ఈ ప్రచారం చ‌క్రపాణిరెడ్డి స్పందించారు. ఆత్మకూరులో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన అన్న శిల్పామోహన్‌ రెడ్డి టీడీపీ నుండి వెళ్లిపోవడంతో నేను కూడా వెళ్లిపోతాననే దృష్ప్రచారం జరుగుతోందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనపై ఎంతో నమ్మకంతో జిల్లా అధ్యక్ష పదవి - ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించి గెలిపించారని, ఆయన రుణాన్ని తీర్చుకోలేనని చ‌క్ర‌పాణి రెడీ ఆన్నారు. వైఎస్‌ ఆర్ పార్టీ నాయకులు తాను పార్టీలోకి వస్తున్నానని, అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీని వీడనని, కొందరు వ్యక్తులు అనవసర మాటలు చెబుతున్నారని అన్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో శిల్పా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవలు నిర్వహించానని, ప్రజలు కూడా తనను ఎంతో ఆదరిస్తున్నారని తెలిపారు. టీడీపీలోనే కొనసాగుతానని ఆయన అన్నారు.